NEET results 2024 : త్వరలో నీట్ యూజీ 2024 ఆన్సర్ కీ విడుదల- ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
NEET results 2024 answer key : త్వరలో నీట్ యూజీ 2024 ఆన్సర్ కీ విడుదలవుతుంది. ఆన్సర్ కీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
NEET results 2024 : నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలో విడుదల చేయనుంది. ఆ తర్వాత.. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు.. exams.nta.ac.in/NEETలోకి వెళ్లి నీట్ యూజీ పరీక్ష ప్రొవిజనల్ ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, తేదీలను ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
నీట్ యూజీ ఆన్సర్ కీతో పాటు ప్రశ్నాపత్రం, అభ్యర్థుల సమాధానాలను కూడా ఎన్టీఏ షేర్ చేస్తుంది..
నీట్ యూజీ ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు తమ ఫీడ్ బ్యాక్ పంపాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేస్తుంది. ఇందుకోసం వారు ఒక్కో క్వైరీకి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను ఆన్సర్ కీ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుస్తోంది.
NEET results 2024 answer key : ఈ ఏడాది 24 లక్షల మంది అభ్యర్థులు.. ఈ జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష రాశారు. నీట్ యూజీ 2024 మే 5 న ఒకే షిఫ్ట్‌లో, భారతదేశం అంతటా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) జరిగింది.
ఇదీ చూడండి:- ICAI CA exam dates: సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించిన ఐసీఏఐ
నీట్ 2024 ఆన్సర్ కీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
- స్టెప్ 1:- exams.nta.ac.in. వెబ్సైట్లోకి వెళ్లండి.
- స్టెప్ 2:- నీట్ యూజీ 2024 పేజీని ఓపెన్ చేయండి.
- స్టెప్ 3:- మీ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేదీని నమోదు చేయండి.
- స్టెప్ 4:- వివరాలు సమర్పించాలి. ప్రొవిజనల్ ఆన్సర్ కీ, నీట్ యూజీ పరీక్షలో అడిగే ప్రశ్నలు తర్వాతి పేజీలో కనిపిస్తాయి.
NEET answer key 2024 : నీట్ యూజీ పరీక్షపై మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎన్టీఏ హెల్ప్‌లైన్ నంబర్లు 011-40759000ను సంప్రదించవచ్చు. neet@nta.ac.in ఈ-మెయిల్ కూడా చేయవచ్చు.
తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లు.. nta.ac.in, exams.nta.ac.in/NEET సందర్శించాలని ఎన్టీఏ సూచించింది.
సాధారణంగా.. ఆన్సర్ కీ విడుదలై, అభ్యంతరాలను నోట్ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత.. నీట్ ఫలితాలు వెలువడతాయి. ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి? అన్న దానిపై సమాచారం లేదు. త్వరలోనే ఓ అప్డెట్ వచ్చే అవకాశం ఉంది. ఆన్సర్ కీ విడుదల తేదీపైనా అతి త్వరలోనే ఒక అప్డేట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
సంబంధిత కథనం