JEE Mains 2024 Session 2 : జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల- ఇలా చెక్ చేయండి..
JEE Mains 2024 Session 2 final answer key : జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైంది. ఇలా చెక్ చేసుకోండి..
JEE Mains 2024 Session 2 answer key : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 2024 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్సైట్ jeemain.nta.ac.in లో ఆన్సర్ కీ ఉంటుంది. జేఈఈ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆన్సర్ కీని అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది జేఈఈ మెయిన్ 2024.. రెండు సెషన్లలో జరిగింది.. జనవరి, ఏప్రిల్. ఏప్రిల్ 4 నుంచి 9 వరకు జేఈఈ మెయిన్ సెషన్ 2 ప్రవేశ పరీక్షను ఎన్టీఏ నిర్వహించగా.. అధికారిక సమాచారం ప్రకారం ఏప్రిల్ 25న రెండో సెషన్ ఫలితాలను విడుదల అవుతాయి.
జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
స్టెప్ 1:- జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- హోం పేజ్ మీద కనిపించే.. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
JEE Mains 2024 Session 2 results 2024 : స్టెప్ 3:- కొత్త విండో ఓపెన్ అవుతుంది. మీ స్క్రీన్‌పై ఒక పీడీఎఫ్ కనిపిస్తుంది.
స్టెప్ 4:- ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ 2024 ఫైనల్ ఆన్సర్ కీతో కూడిన ఆ పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోండి.
స్టెప్ 5:- డౌన్లోడ్ చేసుకున్న ఫైనల్ ఆన్సర్ కీ హార్డ్ కాపీ తీసుకోండి.
ఇదీ చూడండి:- JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా- పూర్తి వివరాలు..
జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఫలితాలను త్వరలోనే ఎన్టీఏ విడుదల చేయనుంది. జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్‌తో పాటు వీటిని విడుదల చేస్తుంది ఎన్టీఏ. మరి.. సెషన్ 2 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
స్టెప్ 1:- ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
How to check JEE Mains 2024 Session 2 results : స్టెప్ 2:- ఫలితాలు వెలువడిన తర్వాత.. హోం పేజ్‌లో జేఈఈ మెయిన్స్ రిజల్ట్ 2024 సెషన్ 2 అనే లింక్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:- మీ లాగిన్ వివరాలను సమర్పించండి. సబ్మీట్ బటన్ క్లిక్ చేయండి.
స్టెప్ 4:- మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
స్టెప్ 5:- ఆ రిజల్ట్స్‌ని డౌన్లోడ్ చేసుకుని, తదుపరి అవసరాల కోసం ప్రింటౌట్ తసుకుని పెట్టుకోండి.
జేఈఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ల సంఖ్య రెండు సెషన్లలో కలిపి 24 లక్షలకు పైగా ఉంది. సెషన్ 1లో 12,21,624 మంది, సెషన్ 2 లో 12.57 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నరు. ఎన్టీఏ డేటా ప్రకారం.. సెషన్ 1 లో 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణ అత్యధికంగా ఏడుగురు అభ్యర్థులతో 100 పర్సంటైల్ హోల్డర్లను నమోదు చేసింది. తరువాత ఆంధ్ర నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు.
సంబంధిత కథనం