వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ పీజీ 2023 (NEET PG 2023) కి అప్లై చేసుకోవడానికి గడవు జనవరి 27తో ముగుస్తోంది. జనవరి 27 తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (National Board of Examinations in Medical Sciences NBEMS) వెల్లడించింది.
ఇప్పటికీ ఈ NEET PG 2023 కి అప్లై చేసుకోని విద్యార్థులు అధికారిక వెబ్ సైట్స్ అయిన natboard.edu.in లేదా nbe.edu.in ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ ఫామ్స్ లో నింపిన వివరాల్లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ఆయా వెబ్ సైట్స్ లో కరెక్షన్ విండో (correction window) జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే అప్ లోడ్ చేసిన ఇమేజెస్ సరిగ్గా లేకపోయినా, తప్పుగా ఉన్నా, వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించే ఫైనల్ అండ్ సెలక్టివ్ ఎడిట్ విండో (Final and Selective Edit Window) ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. NEET PG 2023 అడ్మిట్ కార్డ్స్ ఫిబ్రవరి 27 నుంచి సంబంధిత వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే, NEET PG 2023 పరీక్ష మార్చి 5వ తేదీన జరగనుంది.
టాపిక్