NEET 2023 exam date : 2023 నీట్​ పరీక్ష తేదీని ప్రకటించిన ఎన్​టీఏ.. ఎప్పుడంటే!-nta announced neet 2023 exam date check full details here in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Nta Announced Neet 2023 Exam Date, Check Full Details Here In Telugu

NEET 2023 exam date : 2023 నీట్​ పరీక్ష తేదీని ప్రకటించిన ఎన్​టీఏ.. ఎప్పుడంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 16, 2022 08:47 AM IST

NEET 2023 exam date : 2023 నీట్​ పరీక్షను సంబంధించిన కీలక విషయాన్ని ప్రకటించింది ఎన్​టీఏ. మే 7న నీట్​ పరీక్ష జరుగుతుందని పేర్కొంది.

నీట్​ పరీక్ష తేదీ ఇదే..
నీట్​ పరీక్ష తేదీ ఇదే..

NEET 2023 exam date : 2023 నీట్​(నేషనల్​ ఎలిజబులిటీ ఎంట్రెన్స్​ టెస్ట్​) యూజీ పరీక్ష తేదీని ప్రకటించింది ఎన్​టీఏ(నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ). లేటెస్ట్​ అప్డేట్​ ప్రకారం.. 2023 నీట్​ పరీక్ష మే 7న జరగనుంది. పెన్​ అండ్​ పేపర్​ మోడ్​లో ఈసారి నీట్​ యూజీ పరీక్ష జరగనుంది. ఎగ్జామ్​ రాసేందుకు అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని ఎన్​టీఏ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికి 2023 నీట్​ ఎగ్జామ్​ డేట్​ను మాత్రమే ప్రకటించింది.

2023 నీట్​లో భాగంగా.. 91,827 ఎంబీబీఎస్​, 698 బీడీఎస్​, 52,720 ఆయుష్​, 487 బీఎస్​సీ నర్సింగ్​, 603 బీవీఎస్​సీ సీట్లను భర్తీ చేస్తారు. ఎయిమ్స్​లోని 1899 ఎంబీబీఎస్​, జిప్​మేర్​కు చెందిన 249 ఎంబీబీఎస్​ సీట్ల కోసం కూడా నీట్​ పరీక్షను నిర్వహిస్తారు.

NEET 2023 registration : మెడికల్​, డెంటల్​, నర్సింగ్​, ఆయుష్​ అడ్మిషన్ల కోసం నీట్​ పరీక్షను నిర్వహిస్తుంది ఎన్​టీఏ. అయితే.. 2023 నీట్​ను రెండుసార్లు నిర్వహించే విషయంపై ఎన్​టీఏ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

2018లో మే 6న జరిగిన నీట్​ పరీక్ష కోసం 13,26,725 మంది రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. 2019లో మే 5న జరిగిన పరీక్ష కోసం 15,19,375 మంది రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. 2020లో సెప్టెంబర్​ 13న జరిగిన పరీక్ష కోసం 15,97,435 మంది రిజిస్టర్​ అయ్యారు. ఇక 2021 సెప్టెంబర్​ 12న జరిగిన నీట్​ కోసం 16,14,777మంది రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. 2022లో జులై 17న నీట్​ పరీక్ష జరిగింది. ఈసారి ఏకంగా 18,72,343 మంది రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు.

NEET 2023 latest news : ఈ క్రమంలో నీట్​ రిజిస్ట్రేషన్​, లాస్ట్​ డేట్​, కరెక్షన్​, అలాట్​మెంట్​, అడ్మిట్​ కార్డ్​, ఫలితాలు, కౌన్సిలింగ్​ వంటి వివరాలను ఎన్​టీఏ ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరిన్ని వివరాల కోసం nta.nic.in లేదా neet.nta.nic.in వెబ్​సైట్స్​లను అభ్యర్థులు ఎప్పటికప్పుడు ట్రాక్​ చేయాల్సి ఉంటుంది.

జేఈఈ మెయిన్​ ఎగ్జామ్​..

JEE Main Exam 2023 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం 2023 సంవత్సరం జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.డిసెంబర్ 15 నుంచే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 12, 2023. అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం