Women’s safety : బస్సుల్లో 'పానిక్​ బటన్స్​'.. మహిళల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం!-karnataka to introduce panic buttons in public vehicles for womens safety ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Women’s Safety : బస్సుల్లో 'పానిక్​ బటన్స్​'.. మహిళల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం!

Women’s safety : బస్సుల్లో 'పానిక్​ బటన్స్​'.. మహిళల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం!

Sharath Chitturi HT Telugu
Aug 11, 2023 12:33 PM IST

Women’s safety : మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాల్లో ‘పానిక్​ బటన్స్​’ను ఏర్పాటు చేయనుంది.

బస్సుల్లో 'పానిక్​ బటన్స్​'.. మహిళ భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం!
బస్సుల్లో 'పానిక్​ బటన్స్​'.. మహిళ భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం! (HT_PRINT)

Karnataka Women’s safety : మహిళల భద్రత కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాల్లో 'పానిక్​ బటన్స్​'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం.. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం.. రూ. 30.74 కోట్లను ఆమోదించినట్టు సమాచారం.

పానిక్​ బటన్​తో రక్షణ..!

సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవలే జరిగిన కేబినెట్​ భేటీలో మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వాహనాలు.. అంటే బస్సుల్లో తొలుత.. వెహికిల్​ ట్రాకింగ్​ సిస్టెమ్​ను ఏర్పాటు చేస్తారు. దీనికి పానిక్​ బటన్​ కూడా ఉంటుంది. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక కంట్రోల్​ రూమ్​ ఉంటుంది. మహిళలకు ఏదైనా సమస్య ఎదురైతే.. వెంటనే ఆ పానిక్​ బటన్​ను ప్రెస్​ చేయవచ్చు. అధికారులు వెంటనే స్పందిస్తారు.

ఈ చర్యలతో మహిళా ప్రయాణికుల భద్రత మెరుగుపడుతుంది ప్రభుత్వం భావిస్తోంది.

Panic button in Karnataka buses : "ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పానిక్​ బటన్​ ప్రెస్​ చేస్తే.. అధికారులు వెంటనే స్పందిస్తారు. ముందు కంట్రోల్​ రూమ్​కు అలర్ట్​ వెళుతుంది. సెక్యూరిటీ సిబ్బంది, ఆ వాహనం దగ్గరకు వెళుతుంది. దీనితో మహిళల భద్రత మెరుగుపడుతుంది. అదే సమయంలో వెహికిల్​ ట్రాకింగ్​ సిస్టెమ్​తో ప్రజలు బస్సులు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఫలితంగా వెయిటింగ్​ టైమ్​ కూడా తగ్గుతుంది," అని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్​పీ పాటిల్​ మీడియాకు తెలిపారు.

బస్సులో సేఫ్టీ ఫీచర్స్​ను ఏర్పాటు చేసేందుకు.. బెంగళూరు మెట్రోపాలిటెన్​ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్​కు ఇప్పటికే అనుమతులు లభించాయి. నిర్భయ స్కీమ్​ కింద నిధులు మంజూరు అయ్యాయి. ఈ పూర్తి ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను.. కేఎస్​ఆర్​టీసీ, ఇటీవలే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖకు పంపించింది. అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అనుమతులు లభిస్తే.. ఈ ప్రాజెక్ట్​కు అయ్యే 70శాతం ఖర్చులు కేంద్రమే పెట్టుకుంటుంది. మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి అత్యాచారాలు, హత్యలు వంటి ఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. మణిపూర్​, రాజస్థాన్​లలో మహిళల రక్షణపై సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా ప్రయాణికుల కోసం కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి రక్షణపరమైన చర్యలు తీసుకోవడం వార్తలకెక్కింది. దీని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

సంబంధిత కథనం