అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకన్న సన్నిధికి ఏడు వారాలు వస్తే కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం.  

twitter

By Bandaru Satyaprasad
Jul 23, 2023

Hindustan Times
Telugu

బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు వాడపల్లి వెంకన్నపై నమ్మకంతో ఏకంగా సొంత విమానంలో వారం వారం వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. 

twitter

ఇప్పటికే ఆరు వారాలు పూర్తయ్యాయని, బెంగళూరు వ్యాపారి వాడపల్లి ఆలయానికి రూ.కోటి విరాళం అందించారని ఆలయ అధికారులు తెలిపారు. 

twitter

బెంగళూరు వ్యాపారి సొంత విమానంలో రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చి, అక్కడి నుంచి కారులో వాడపల్లి వస్తున్నారని తెలుస్తోంది. 

twitter

సొంత విమానంలో ఓ భక్తుడు వాడపల్లి వస్తుండడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

twitter

ఏడు వారాల పాటు విధిగా వాడపల్లిలోని దేవుడి సన్నిధికి వస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. 

twitter

బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి కూడా తన కోరికలు తీర్చుకోవడం కోసం ప్రతివారం వాడపల్లికి వస్తున్నారు.  

twitter

ఈ క్షేత్రంలో ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకొని, పదకొండు ప్రదక్షిణలు చేసిన భక్తుల కోరికలు స్వామి వారు నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది

twitter

తెలివైన ఆరు జంతువులేంటో మీకు తెలుసా!

Pixabay