ITBP Constable Recruitment 2024 : ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకు రేపటి నుంచే దరఖాస్తులు.. ఇలా అప్లై చేయాలి-itbp constable recruitment 2024 registration for 819 posts begins tomorrow september 2nd heres step by step process ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Itbp Constable Recruitment 2024 : ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకు రేపటి నుంచే దరఖాస్తులు.. ఇలా అప్లై చేయాలి

ITBP Constable Recruitment 2024 : ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకు రేపటి నుంచే దరఖాస్తులు.. ఇలా అప్లై చేయాలి

Anand Sai HT Telugu
Sep 01, 2024 08:27 PM IST

ITBP Constable Recruitment 2024 : ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు రేపటి(సెప్టెంబర్ 2) నుంచి దరఖాస్తు చేసుకోవాలి. recruitment.itbpolice.nic.in వెబ్‌సైల్ వెళ్లి అప్లై చేసుకోవాలి.

ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులు
ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులు

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) గ్రూప్ 'సి' పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 2న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 819 ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు recruitment.itbpolice.nic.in దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 1గా నిర్ణయించారు.

ఖాళీల వివరాలు

మెుత్తం 819 కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) పోస్టులకు ఐటీబీపీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుషులకు 697 ఖాళీలు, మహిళలకు 122 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 2 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత ప్రమాణాలు

పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్‌లో ఎన్ఎస్‌క్యూఎఫ్ లెవల్ 1 కోర్సు చదివి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ అండ్ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (డీఎంఈ)/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (ఆర్ఎంఈ) ఉంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలు, మాజీ సైనికులు, అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లించడం నుండి మినహాయింపు ఉంది

ఎలా దరఖాస్తు చేయాలి?

recruitment.itbpolice.nic.in ఐటీబీపీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.

హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 (కిచెన్ సర్వీసెస్) అప్లికేషన్ లింక్‌ను ఓపెన్ చేయండి.

ముందుగా రిజిస్టర్ చేసుకుని మీ లాగిన్ వివరాలు పొందండి.

ఇప్పుడు దరఖాస్తు ఫారాన్ని నింపడానికి కంటిన్యూ చేయాలి.

అభ్యర్థించిన సమాచారాన్ని నమోదు చేసి, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

మీ ఫారమ్ సబ్మిట్ చేయండి. ధృవీకరణ పేజీని డౌన్లోడ్ చేయండి.