Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. 2280 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు జూనియర్ కాలేజీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీలైనంత తొందరగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 2280 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ.. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్థులను కాంట్రాక్ట్, పార్ట్ టైమ్, గెస్ట్ లెక్చరర్లుగా ఎంపిక చేయనున్నారు.
2025 మార్చి 31 వరకు..
జూనియర్ కాలేజీల్లో.. 1654 గెస్ట్ లెక్టరర్లు, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ.. తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2025 మార్చి 31 వరకు బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ తాత్కాలిక నియామకాలు చేపట్టనుంది. అతి త్వరలోనే వీటికి సంబంధించి నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆగస్టు 2న జాబ్ క్యాలెండర్ విడుదల..
తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 2న జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయాలను క్యాలెండర్‌లో వివరించింది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంంబ్లీలో ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం.. గ్రూప్-1 పరీక్షలు అక్టోబర్‌లో, గ్రూప్-2ను డిసెంబర్‌ల, గ్రూప్-3 నవంబరులో నిర్వహించనున్నారు.
జాబ్ క్యాలెండర్‌లోని సమగ్ర వివరాలు..
1.వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
2.ట్రాన్స్‌కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం.. అక్టోబర్‌లో నోటిఫికేషన్ రానుంది. 2025 జనవరిలో నియామక పరీక్షలు జరగనున్నాయి.
3.నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. 2025 జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు.
4.పలు శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం 2025 జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి.. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
5.2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
6.ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 2025 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది. మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు.
7.గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష 2025 జులైలో నిర్వహించనున్నారు.
8.ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 2025 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి.. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నారు.
9.డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు 2025 జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చి.. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
10.2025 మే నెలలో మరోసారి గ్రూపు-2 నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అక్టోబర్‌లో పరీక్షలు జరగనున్నాయి.
11.2025 జులైలో గ్రూప్-3 నోటిఫికేషన్ ఇచ్చి.. నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
12.సింగరేణిలో ఉద్యోగాల భర్తీ కోసం.. 2025 జులైలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నవంబర్‌లో పరీక్షలు జరుగుతాయి.