ITBP Constable Jobs : కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. సెప్టెంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్-itbp constable recruitment 2024 registration for 819 posts application starts from september 2 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Itbp Constable Jobs : కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. సెప్టెంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్

ITBP Constable Jobs : కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. సెప్టెంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్

Anand Sai HT Telugu
Aug 29, 2024 12:05 PM IST

ITBP Constable Recruitment 2024 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ITBP కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలు ఏంటో చూద్దాం..

ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, ITBP కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ITBP అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 819 పోస్టులను భర్తీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 2న ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1, 2024న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలను తెలుసుకుందాం..

మెుత్తం ఖాళీ వివరాలు

పురుషులు: 697 పోస్ట్‌లు, స్త్రీ: 122 పోస్ట్‌లు

అర్హత ప్రమాణాలు

పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME)/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (RME) ఉంటాయి. దరఖాస్తు రుసుము రూ. 100గా నిర్ణయించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలు, మాజీ సైనికులు, అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

recruitment.itbpolice.nic.inలో ITBP అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ITBP కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

సబ్‌మిట్‌పై క్లిక్ చేసి ఖాతాకు లాగిన్ చేయండి.

దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. దరఖాస్తు రుసుం చెల్లించండి.

సబ్‌మిట్‌పై క్లిక్ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేయండి.

తదుపరి అవసరం కోసం అదే హార్డ్ కాపీని మీ దగ్గర ఉంచుకోండి.