RRB Jobs : ఇంకా ఈ రైల్వే పోస్టులకు అప్లై చేయలేదా? చివరి తేదీ వచ్చింది.. వెంటనే చేసేయండి-last date to apply for rrb je recruitment 2024 for 7951 junior engineer and other vacancies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rrb Jobs : ఇంకా ఈ రైల్వే పోస్టులకు అప్లై చేయలేదా? చివరి తేదీ వచ్చింది.. వెంటనే చేసేయండి

RRB Jobs : ఇంకా ఈ రైల్వే పోస్టులకు అప్లై చేయలేదా? చివరి తేదీ వచ్చింది.. వెంటనే చేసేయండి

Anand Sai HT Telugu
Aug 29, 2024 11:35 AM IST

RRB JE Recruitment 2024 : ఆర్ఆర్‌బీలో పలు పోస్టులక కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే చివరి తేదీ వచ్చింది. అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు rrbapply.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చదవండి.

రైల్వే ఉద్యోగాలు
రైల్వే ఉద్యోగాలు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ( RRB ) జూనియర్ ఇంజనీర్లు (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్‌లు (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్‌లు (CMA), కెమికల్ సూపర్‌వైజర్లు (రిసెర్చ్), మెటలర్జికల్ సూపర్‌వైజర్లు (రిసెర్చ్) పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. అయితే దరఖాస్తు కోసం చివరి తేదీ వచ్చింది. ఆగస్టు 29 చివరి రోజుగా ఉంది. అర్హత గల అభ్యర్థులు rrbapply.gov.inలో CEN నంబర్ 03/2024 కింద ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు

ఆర్ఆర్‌బీ జేఈ 2024 ద్వారా 7,951 ఖాళీలను భర్తి చేస్తున్నారు. అయితే ఇందులో 17 పోస్టులు గోరఖ్‌పూర్‌లో కెమికల్ సూపర్‌వైజర్/రీసెర్చ్, మెటలర్జికల్ సూపర్‌వైజర్/రీసెర్చ్ పోస్టులకు సంబంధించినవి. మిగిలిన 7,934 ఖాళీలు జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మరియు మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులుగా ఉన్నాయి.

ఆగస్టు 30న ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు ఫారమ్ ఎడిట్ విండో తెరుస్తారు. అభ్యర్థులు తమ ఫారమ్‌లలో ఏవైనా అవసరమైన మార్పు(లు) చేయడానికి సెప్టెంబర్ 8 వరకు అవకాశం ఉంటుంది.

అర్హతలు

జనవరి 1, 2024 నాటికి కనీస వయసు 18 ఏళ్లకు తక్కువగా ఉండకూడదు. 36 ఏళ్ల మించని అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒక అభ్యర్థి బహుళ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఒక ఫారమ్‌ను మాత్రమే సమర్పించగలరు. ఒక్కో పోస్టుకు అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

రెండు టెస్టులు

అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి RRB రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)ని నిర్వహిస్తుంది. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, స్త్రీ, ట్రాన్స్ జెండర్స్, మైనారిటీలు, మాజీ సైనికులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC) కేటగిరీ అభ్యర్థులకు రూ. 250గా నిర్ణయించారు. మిగతా వారందరికీ రూ.500 రుసుం చెల్లించాలి. మొదటి CBTలో అర్హత సాధించినవారికి బ్యాంక్ ఛార్జీల మినహాయింపు తర్వాత అప్లికేషన్ ఫీజులో కొంత భాగాన్ని వాపసు చేస్తామని ఆర్ఆర్‌బి తెలిపింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంబంధిత ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలి.