RRB Recruitment 2024 : రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి-rrb paramedical recruitment 2024 registration process starts for 1376 railway jobs at rrbcdg gov in ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rrb Recruitment 2024 : రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

RRB Recruitment 2024 : రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

Anand Sai HT Telugu
Aug 18, 2024 10:30 AM IST

RRB Jobs : రైల్వేలో పలు ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మెుత్తం 1376 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ వెళ్లి అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16న చివరి తేదీగా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో కావాలి.

రైల్వేలో ఉద్యోగాలు
రైల్వేలో ఉద్యోగాలు (Photo Source From unsplash.com)

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అడ్వాట్ నెం 04/2024 కింద పారా-మెడికల్‌లో వివిధ పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. RRB పారామెడికల్ రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు ఫారమ్ అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.inలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు RRB పారామెడికల్ స్టాఫ్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను అధికారిక పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు.

మొత్తం 1376 ఖాళీల కోసం RRB పారామెడికల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను బోర్డు విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 16, 2024గా నిర్ణయించారు. RRB పారామెడిషియల్ అప్లికేషన్ ఫారమ్‌ను ఎడిట్ చేసుకునేందుకు కూడా ఎంపికను ఇచ్చారు. ఎడిట్ విండో సెప్టెంబర్ 17 నుండి 26, 2024 వరకు అందుబాటులో ఉంటుంది.

అడ్వాట్ నెం 04/2024 కింద పారా-మెడికల్ పోస్ట్‌లను భర్తి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ విండో చివరి తేదీ సెప్టెంబర్ 16, 2024గా ఉంది. దరఖాస్తు రుసుము రూ. 500 చెల్లించాలి.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

స్టెప్ 1 : RRB అధికారిక వెబ్‌సైట్‌ని rrbcdg.gov.inలో తెరవండి

స్టెప్ 2 : క్రిందికి స్క్రోల్ చేయండి. CEN-04/2024 (పారామెడికల్) అప్లికేషన్ ఫారమ్ లింక్‌ను కనుగొనండి

స్టెప్ 3 : లింక్‌పై క్లిక్ చేస్తే సంబంధిత పేజీ ఓపెన్ అవుతుంది.

స్టెప్ 4 : అకడమిక్, వ్యక్తిగత వివరాలతో సహా అన్ని వివరాలతో RRB పారామెడికల్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

స్టెప్ 5 : దరఖాస్తు రుసుము చెల్లించండి.

స్టెప్ 6 : అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

స్టెప్ 7 : RRB పారామెడికల్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను సమర్పించండి.

స్టెప్ 8 : RRB పారామెడికల్ రిక్రూట్‌మెంట్ నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేయండి.

స్టెప్ 9 : భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి

కనీస విద్యార్హత, వయో పరిమితి ఒక పోస్టుకు మరో పోస్టుకు మారుతూ ఉంటుంది. అభ్యర్థులు వయోపరిమితి, విద్యార్హత కోసం అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను చూడాలి. SC, ST అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు చెందిన అభ్యర్థులకు ఇది 3 సంవత్సరాలుగా నిర్ణయించారు.

కనీస విద్యార్హత, జీతం, ఇతర వివరాల గురించి తెలుసుకోవడం కోసం RRB పారామెడికల్ నోటిఫికేషన్‌ను కచ్చితంగా చదవాలి. rrbcdg.gov.in అధికారిక పోర్టల్‌ను సందర్శిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి.

Whats_app_banner