India Post GDS Recruitment : పోస్టల్ శాఖలో 44,228 జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఖాళీలు.. పది పాసైతే చాలు-india post gds recruitment 2024 notification for 44228 vacancies online application starts see andhra pradesh and telang ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Post Gds Recruitment : పోస్టల్ శాఖలో 44,228 జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఖాళీలు.. పది పాసైతే చాలు

India Post GDS Recruitment : పోస్టల్ శాఖలో 44,228 జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఖాళీలు.. పది పాసైతే చాలు

Anand Sai HT Telugu
Jul 15, 2024 07:25 PM IST

India Post GDS Recruitment 2024 : పోస్టల్ శాఖలో భారీ ఎత్తున రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ వెలువడింది. మెుత్తం 44,228 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ కోసం అప్లై ఎలా చేయాలో తెలుసుకుందాం..

పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో 44,228 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫిషన్ ద్వారా జీడీఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ జులై 15 నుంచి ప్రారంభమైందని గుర్తించాలి. దరఖాస్తు చివరి తేది ఆగస్టు 5, 2024గా నిర్ణయించారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఖా

indiapostgdsonline.gov.in ద్వారా ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారి వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకూ గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ, ట్రాన్స్ఉమెన్ అభ్యర్థులకు ధరఖాస్తు ఫీజు ఉండదు. మిగిలినవారు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 656 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలాగే తెలంగాణలో 454 పోస్టులకు అప్లికేషన్ ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం ఎంతంటే

ఉద్యోగం పొందిన వారు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) / డాక్ సేవక్‌గా నియమితులవుతారు. పోస్ట్‌ల కోసం జీతాలు కింది విధంగా ఉన్నాయి: ABPM / GDS కోసం నెలకు రూ. 10,000 నుంచి రూ.24,470, BPM కోసం రూ.12,000, రూ.29,380.గా ఉండనుంది. 10వ తరగతి సర్టిఫికేట్ ఉన్న 18-40 సంవత్సరాల మధ్య ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం

దరఖాస్తు విధానం మూడు దశల్లో ఉంటుంది. అవి రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుము, ఆన్‌లైన్ దరఖాస్తు. ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..

ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ www.indiapostgdsonline.gov.in ను సందర్శించండి.

ఇక్కడ మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.

పాస్‌వర్డ్‌తో నమోదు చేసుకోవడానికి మీకు మొబైల్ నంబర్, ఇమెయిల్ ID అవసరం

రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత లాగిన్ అయి ఫీజ్ పేమెంట్ చేయాలి.

తర్వాత ఆసక్తి ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవాలి.

అనంతరం మీరు డివిజన్ ఎంపిక చేసుకోవాలి.

అనంతరం ఫోటో, సంతకం.. చెప్పిన ఫార్మాట్ ప్రకారం అప్‌లోడ్ చేయాలి.

మీరు దరఖాస్తు చేస్తున్న డివిజన్ డివిజనల్ హెడ్‌ని కూడా మీరు తప్పక ఎంచుకోవాలి. రిక్రూట్‌మెంట్ తర్వాతి దశలో మీ పత్రాలను పరిశీలిస్తారు.

ఎలా సెలక్ట్ చేస్తారు?

మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అవుతారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ఉండనుంది. సెలక్ట్ అయిన అభ్యర్థుల వివరాలు జీడీఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. మీ మెుబైల్ నెంబర్, ఈమెయిల్‌కు వెరిఫికేషన్ వివరాలను పంపిస్తారు.

Whats_app_banner