Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు-heavy rains ease around houston but flooding remains after hundreds of rescues and evacuations ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Houston Floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

Sharath Chitturi HT Telugu
May 06, 2024 04:21 PM IST

Houston flood today : భారీ వర్షాలకు అమెరికా టెక్సాస్​లోని హూస్టన్​ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.

హూస్టన్​ వరదల్లో చిక్కుకున్న ఓ కారు..
హూస్టన్​ వరదల్లో చిక్కుకున్న ఓ కారు.. (Houston Chronical )

Texas flood today : భారీ వర్షాలతో గత కొన్ని రోజుల పాటు ఉక్కిరిబిక్కిరి అయిన అమెరికా టెక్సాస్​లో నిదానంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరీ ముఖ్యంగా.. వరదలతో అల్లాడిపోయిన హూస్టన్​ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ.. మళ్లీ జనజీవనం సాధారణ స్థితికి చేరేందుకు సమయం పడుతుందని తెలుస్తోంది.

టెక్సాస్​- హూస్టన్​లో వరద బీభత్సం..

టెక్సాస్​లో వరదలు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచాయి. హూస్టన్​ని వరద నీరు ముంచెత్తింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా మంది ప్రజలు.. చాలా రోజుల పాటు ఇళ్ల పైకప్పుల మీద ఆశ్రయం పొందాల్సి వచ్చింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోవడంతో, అందులో ఉన్న ఓ 5ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తడి ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచసుకుంది. కారులో ఉన్న ఇద్దరు పెద్దవారిని సహాయక సిబ్బంది కాపాడింది. కనీ బాలుడు మాత్రం మరణించాడు.

Houston floods death toll : రానున్న రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని అక్కడి వాతావరణశాఖ చెప్పిన్నప్పటికీ.. రోడ్లు, ఇళ్లల్లో పేరుకుపోయిన వరద నీటిని చూసి హూస్టన్​వాసులు భయపడిపోతున్నారు. వరద నీరు పూర్తిగా తొలగిపోయిన ప్రాంతాల్లో.. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి:- Dubai floods: ఎడారి నగరంలో కుండపోత వాన; నీట మునిగిన దుబాయ్

అమెరికావ్యాప్తంగా వరదలు అధికంగా ఉండే నగరాల్లో హూస్టన్​ ఒకటి. 2017లో సంభవించిన హురికెన్​ హార్వీ.. వేలాది ఇళ్లను ముంచేసింది. నాడు.. దేశ చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది.

Houston floods 2024 : ఇక ప్రస్తుత వరదల విషయానికొస్తే.. వారం రోజుల వ్యవధిలో  అమెరికాలోని ఈశాన్య హూస్టన్​లో ఉండే లేక్​ లివింగ్​స్టన్​లో 58సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సెంట్రల్​ టెక్సాస్​లో 6-8 గంటల వ్యవధిలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వరద ముప్పు తీవ్రంగా ఉన్న సమయంలోనే వందలాది మంది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారు. ఇక ఇప్పుడు.. వరద ప్రభావం తగ్గుతుండటంతో అటు సహాయక చర్యలు, ఇటు పునరుద్ధరణ కార్యకలాపాలను జోరుగా సాగిస్తున్నారు.

సంబంధిత కథనం