(1 / 8)
(2 / 8)
గల్ఫ్ దేశాల్లో వర్షాలు కురవడం చాలా అరుదు. కానీ, అనూహ్యంగా సోమవారం రాత్రి నుంచి భారీ వర్షం దుబాయ్ ను ముంచెత్తింది. ఏడాదిన్నర వర్షపాతం 24 గంటల్లోనే నమోదైంది.
(Bloomberg)(3 / 8)
డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో భారీ వర్షాలతో దుబాయ్ లో రహదారులు జలమయమయ్యాయి. నీట మునిగిన రోడ్లపైననే కార్లు తిరిగాయి.
(AFP)(4 / 8)
దుబాయ్ లో అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం భారీ వర్షాల కారణంగా రన్ వే దాదాపు మునిగిపోయింది. దాంతో, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
(AP)(5 / 8)
పొరుగున ఉన్న ఒమన్ ను ముంచెత్తిన వర్షాలు మంగళవారం యూఏఈని అతలాకుతలం చేశాయి.దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లను కూడా వర్షపు నీరు ముంచెత్తింది.
(AP)(6 / 8)
భారీ వర్షాలు, వరదల కారణంగా యూఏఈలో ఒకరు, ఒమన్లో 20 మంది చనిపోయారు.
(REUTERS)(7 / 8)
ఈ భారీ వర్షాలకు క్లౌడ్ సీడింగ్ కారణమని భావిస్తున్నారు. యూఏఈలో వర్షాల కోసం 2002 నుంచి క్లౌడ్ సీడింగ్ నిర్వహిస్తున్నారు.
(REUTERS)(8 / 8)
మరోవైపు, వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
(AP)ఇతర గ్యాలరీలు