Haryana polls: హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. కారణం వివరించిన ఎన్నికల సంఘం-haryana polls postponed to october 5 counting of votes on october 8 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Haryana Polls: హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. కారణం వివరించిన ఎన్నికల సంఘం

Haryana polls: హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. కారణం వివరించిన ఎన్నికల సంఘం

Sudarshan V HT Telugu
Aug 31, 2024 07:49 PM IST

హర్యానా, జమ్మూకశ్మర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను, ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించే తేదీని ఎన్నికల సంఘం వాయిదా వేసింది. హర్యానాలో అక్టోబర్ 1వ తేదీన జరగాల్సిన పోలింగ్ ను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. జమ్ముకశ్మీర్, హరియాణా ఎన్నికల కౌంటింగ్ తేదీలను అక్టోబర్ 8కి మార్చారు.

హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా
హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా (Photo: Raju Shinde/HT)

Haryana polls: హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని అక్టోబర్ 5వ తేదీకి కేంద్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్ చేసింది. గత కొన్ని శతాబ్దాలుగా బిష్ణోయ్ కమ్యూనిటీ జరుపుకుంటున్న పండుగను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దాంతోపాటు, అక్టోబర్ 1కి ముందు, అక్టోబర్1 తరువాత సెలవులు ఉండడం వల్ల అది ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతుందని ఈసీకి బీజేపీ ఒక లేఖ రాసింది. ఈ నేపథ్యంలో, జమ్మూకశ్మీర్ మూడో విడత పోలింగ్ తేదీని అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న

జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీలను అక్టోబర్ 4కు బదులుగా అక్టోబర్ 8కి ఎన్నికల సంఘం సవరించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని రీషెడ్యూల్ చేయాలని రాజస్థాన్ లోని బికనీర్ లోని ఆల్ ఇండియా బిష్ణోయ్ మహాసభ జాతీయ అధ్యక్షుడి నుంచి ఈసీకి వినతిపత్రం అందింది. ఈ ఏడాది అక్టోబర్ 2న గురు జంభేశ్వర్ స్మారకోత్సవం జరుగుతుండగా, సిర్సా, ఫతేహాబాద్, హిసార్ లలో నివసిస్తున్న వేలాది బిష్ణోయ్ కుటుంబాలు ఆ రోజు రాజస్థాన్ కు వెళ్లనున్నాయి. తమ గురు జంభేశ్వర్ జ్ఞాపకార్థం అసోజ్ అమావాస్య ఉత్సవ వేడుకలో పాల్గొనే శతాబ్దాల సంప్రదాయాన్ని బిష్ణోయ్ కమ్యూనిటీ ఎన్నికల సంఘానికి వివరించింది. దాంతో, ఆ రోజు హర్యానాలో జరిగే పోలింగ్ ను వాయిదా వేయాలని ఈసీ నిర్ణయించింది.

లాంగ్ వీకెండ్..

అక్టోబర్ 1వ తేదీకి ముందు, వెనుక సెలవులు ఉన్నాయని, అందువల్ల, ఆ తేదీన పోలింగ్ నిర్వహిస్తే, అది పోలింగ్ శాతంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని బీజేపీ ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ‘‘శనివారం (సెప్టెంబర్ 28) చాలా మందికి సెలవుదినం కాగా, ఆదివారం సెలవు దినం. అక్టోబర్ 1 న రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా సెలవు ఇచ్చారు. తరువాత అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవుదినం. అక్టోబర్ 3 మహారాజా అగ్రసేన్ జయంతి కారణంగా హాలీడే ఉంటుంది. ఇన్ని రోజులు వరుసగా సెలవులు రావడం వల్ల ఓటర్లు విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది’’ అని బీజేపీ ఎన్నికల సంఘానికి (election commission) వివరించింది.

Poll EventsJ&K Phase 3Haryana (All constituencies)
Date of Issue of Gazette Notification05.09.2024 05.09.2024
Last Date of Making Nominations12.09.202412.09.2024
Date for Scrutiny of Nominations13.09.202413.09.2024
Last Date for Withdrawal of Candidatures17.09.202416.09.2024
Date of Poll 01. 10.2024 (No Change)05.10.2024
Date of Counting08.10. 2024 08.10. 2024

Whats_app_banner