Gandhi Jayanti Movies: గాంధీ జయంతి రోజు ఓటీటీల్లోని ఈ సినిమాలు తప్పకుండా చూడండి-gandhi jayanti must watch movies in ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gandhi Jayanti Movies: గాంధీ జయంతి రోజు ఓటీటీల్లోని ఈ సినిమాలు తప్పకుండా చూడండి

Gandhi Jayanti Movies: గాంధీ జయంతి రోజు ఓటీటీల్లోని ఈ సినిమాలు తప్పకుండా చూడండి

Hari Prasad S HT Telugu

Gandhi Jayanti Movies: గాంధీ జయంతి రోజు ఓటీటీల్లోని ఈ సినిమాలు తప్పకుండా చూడండి. మీ పిల్లలకూ చూపించండి. అసలు గాంధీ ఎవరు? గాంధేయ వాదం గొప్పతనం ఏంటి అన్నది ఈ సినిమాలు చూపిస్తాయి.

గాంధీ మై ఫాదర్ మూవీ

Gandhi Jayanti Movies: మహాత్మా గాంధీ జయంతిని సోమవారం (అక్టోబర్ 2) దేశమంతా జరుపుకుంటోంది. మహాత్ముడికి ఘన నివాళులు అర్పిస్తోంది. ఈ సందర్భంగా ఓటీటీల్లో గాంధీ, గాంధేయ వాదంపై వచ్చిన కొన్ని సినిమాలు ఆయన గొప్పతనమేంటో చాటి చెప్పేలా ఉన్నాయి.

ఈ సినిమాలు మీరూ చూడండి. మీ పిల్లలకూ చూపించండి. ఆయన జీవితాన్ని కళ్లకు కట్టే కొన్ని సినిమాలు ఇక్కడ ఇస్తున్నాం. ఆయా ఓటీటీల్లోని ఈ మూవీస్ ను గాంధీ జయంతి సందర్భంగా చూసేయండి.

లగే రహో మున్నాభాయ్ - అమెజాన్ ప్రైమ్ వీడియో

గాంధీగిరీని సరదాగా, చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేసే రీతిలో చాటి చెప్పిన సినిమా ఈ లగే రహో మున్నాభాయ్. తెలుగులోనూ చిరంజీవి శంకర్‌దాదా జిందాబాద్ పేరుతో ఈ సినిమా తీశాడు. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన లగే రహో మున్నాభాయ్ మూవీ గాంధేయ వాదాన్ని చాలా చక్కగా చూపించింది. సంజయ్ దత్, అర్షద్ వార్సీ, విద్యా బాలన్, బొమన్ ఇరానీ నటించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

మైనే గాంధీ కో నహీ మారా - జీ5

గాంధీ మరణానికి తానే కారణమనుకుంటూ పశ్చాత్తాప పడుతూ జీవించే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథే ఈ మైనే గాంధీ కో నహీ మారా మూవీ. అల్జీమర్స్ తో బాధపడే ఆ వ్యక్తి ఎందుకలా భావిస్తుంటాడు? అతన్ని కాపాడుకోవడానికి అతని కూతురు ఏం చేస్తుందనేది ఈ సినిమా కథ. అనుపమ్ ఖేర్, ఊర్మిళ నటించిన ఈ సినిమా 2005లో రిలీజైంది. ప్రస్తుతం జీ5తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

గాంధీ, మై ఫాదర్ - అమెజాన్ ప్రైమ్ వీడియో

గాంధీని, ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించే ఆయన తనయుడు హీరాలాల్ ఎలా తాగుడుకు బానిసవుతాడో చెప్పే సినిమా ఇది. వినోదాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, దర్శన్ జరీవాలా, షెఫాలీ షా, భూమిక నటించారు. 2007లో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

గాంధీ టు హిట్లర్ - అమెజాన్ ప్రైమ్ వీడియో

హిట్లర్ హింసావాదం, గాంధీ అహింసావాదం చుట్టూ తిరిగే కథే ఈ గాంధీ టు హిట్లర్. బ్రిటీష్ నుంచి ఇండియాకు ఇండిపెండెన్స్ కోసం హిట్లర్ సాయం చేస్తుంటే.. మీరు చేసే హింసను ఆపండంటూ హిట్లర్ కు గాంధీ లేఖలు రాస్తుంటారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని తప్పించడానికి గాంధీ చేసిన ప్రయత్నాన్ని ఈ సినిమాలో చూడొచ్చు. రాకేశ్ రంజన్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

హే రామ్ - జియో సినిమా

దేశ విభజన, గాంధీ హత్య చుట్టూ తిరిగే ఓ వివాదాస్పద కథతో కమల్ హాసన్ తెరకెక్కించిన సినిమాయే ఈ హే రామ్. కమల్ హాసన్ తోపాటు రాణీ ముఖర్జీ, షారుక్ ఖాన్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. ఈ మూవీని జియో సినిమాతోపాటు ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లలోనూ చూడొచ్చు.