SIT Report to Ec: ఏపీ ఎన్నికల ఘర్షణల్లో 1370మంది నిందితులు, 124మంది అరెస్ట్, కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన నివేదిక-1370 accused 124 arrested in ap election clashes report reached to central election commission ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sit Report To Ec: ఏపీ ఎన్నికల ఘర్షణల్లో 1370మంది నిందితులు, 124మంది అరెస్ట్, కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన నివేదిక

SIT Report to Ec: ఏపీ ఎన్నికల ఘర్షణల్లో 1370మంది నిందితులు, 124మంది అరెస్ట్, కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన నివేదిక

Sarath chandra.B HT Telugu
May 21, 2024 09:48 AM IST

SIT Report to Ec: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణల్లో 1370మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 124మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. 731మందిని గుర్తించగా, మరో 639మందిని గుర్తించాల్సి ఉంది.

నివేదికను డీజీపీకి  అందచేస్తున్న సిట్ బృందానికి నేతృత్వం వహించిన వినీత్ బ్రిజ్‌లాల్‌
నివేదికను డీజీపీకి అందచేస్తున్న సిట్ బృందానికి నేతృత్వం వహించిన వినీత్ బ్రిజ్‌లాల్‌

SIT Report to Ec: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ రోజు, ఎన్నికల అనంతర హింసాకాండలో పాల్గొన్న 1,370 మందిలో 124 మంది నిందితులను పోలీసులు సోమవారం నాటికి అరెస్టు చేశారు.

yearly horoscope entry point

అల్లర్లపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు 150 పేజీల నివేదికను సమర్పించింది.

మరోవైపు ఏపీలో పోలింగ్ అనంతరం తలెత్తిన హింసాత్మక ఘటనల్లో కఠినమైన సెక్షన్లను నమోదు చేయకపోవడాన్ని సెట్ అధికారులు గుర్తించారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనల్లో ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద సెక్షన్లను నమోదు చేయకపోవడాన్ని సెట్ ప్రస్తావించింది.

ఎన్నికల హింసపై రాష్ట్ర వ్యాప్తంగా 33 కేసులు నమోదు చేశారు. వీటిలో 1370 మందిని నిందితులుగా పేర్కొన్నారు. మాచర్ల, నరసరావు పేటలో జరిగిన ఘర్షణల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడాన్ని సిట్ గుర్తించింది.

ఈసీ ఆదేశాలతో రాష్ట ప్రభుత్వం సెట్‌ను ఏర్పాటు చేసింది. వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సెట్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై 150పేజీలతో నివేదికను డీజీపీకి సిట్ బృందం సమర్పించింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.

ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగినా తీవ్రమైన సెక్షన్లను నమోదు చేయకపోవడాన్ని సిట్ గుర్తించింది. దళితులపై జరిగిన దాడులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయకపోవడం, నామమాత్రపు సెక్షన్లతో కేసులు సరిపెట్టడాన్ని ప్రస్తావించారు. కొన్ని చోట్ల నిందితుల్ని అరెస్ట్ చేయకుండా 41ఏ నోటీసులు ఇచ్చి సరిపెట్టేశారు.

మొత్తం 33 కేసుల్లో 1370మంది నిందితులు సిట్ పేర్కొంది. వారిలో 731మందిని మాత్రమే గుర్తించారు. మరో 639మంది మందిని గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. 124మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. 94మందికి 41ఏ నోటీసులు ఇచ్చారు. నిందితుల్ని గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వాడాలని సీసీటీవీ ఫుటేజీలు, వీడియోలు ఆధారంగా నిందితుల్ని గుర్తించాలని ఆదేశించారు.

మాచర్ల, నరసరావుపేటలో ఒక్కర్నీ కూడా అరెస్ట్ చేయకపోవడంపై సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 18కేసుల్లో 474మందిని నిందితులుగా గుర్తించినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. 67మందికి నోటీసులు ఇచ్చారు. గురజాలలో 4 కేసుల్లో 107మందిని నిందితులుగా పేర్కొన్నా 19మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో 7కేసుల్లో 728మంది నిందితుల్లో 91మందిని అరెస్ట్ చేవారు. చంద్రగిరి, తిరుపతి నియోజక వర్గాల్లో 4కేసుల్లో 61మందిలో 14మందిని అరెస్ట్ చేశారు.

పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో సిట్ బృందం విస్తృతంగా పర్యటించి నివేదిక రూపొందించారు. ఆరు నియోజక వర్గాల పరిధిలో నమోదైన 33కేసుల్ని పరిశీలించారు. ఈ కేసుల్లో తీవ్రమైన హింసాత్మక ఘటనలు జరిగిన మాచర్ల, నరసరావుపేట, గురజాల నియోజక వర్గాల్లో నమోదైన 22కేసులు, తిరుపతిలో చంద్రగిరి, తిరుపతిలో నమోదైన నాలుగు కేసులు, అనంతపురం తాడిపత్రిలో నమోదైన ఏడు కేసుల్లో నివేదికల్ని పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు నివేదికల్ని పరిశీలించారు.

ఈ బృందాలు నేరాలు జరిగిన ప్రాంతాలను సందర్శించి, దర్యాప్తు అధికారులు, బాధిత వ్యక్తులతో మాట్లాడి, ధృవీకరించిన భౌతిక సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు తగిన చట్ట సెక్షన్లు వర్తించాయో లేదో తనిఖీ చేశాయి. ఘటనలన్నింటినీ కేసులుగా నమోదు చేశారా, నిందితులను గుర్తించారా, అరెస్టులు జరిగాయా లేదా తదితర అంశాలను పరిశీలించారు.

అరెస్టయిన వారిలో 94 మందికి సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చామని, పెండింగ్ అరెస్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సిట్.. దర్యాప్తు అధికారులకు సూచించింది. ఈ జిల్లాల్లోని నరసరావుపేట, మాచర్ల, గురజాల, చంద్రగిరి, తిరుపతి, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన అనేక నేరాలు చాలా తీవ్రమైనవని బ్రిజ్ లాల్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది.

Whats_app_banner

సంబంధిత కథనం