H1B visa domestic renewal: వర్క్ వీసాపై అమెరికాలో ఉన్నవారు తమ వీసా రెన్యువల్ ను ఇకపై అక్కడే ఉండి చేసుకునే వీలు కల్పించే పైలట్ ప్రాజెక్టును అమెరికా ఇటీవల ప్రారంభించింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నియమ, నిబంధనల్లో ఒక కీలక అంశం ఉంది.
అమెరికాలోనే ఉండి తమ వర్క్ వీసాలను రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని అక్కడి విదేశీ ఉద్యోగులకు అమెరికా కల్పించింది. అయితే, ఈ అవకాశం వీసాదారులకు మాత్రమే ఉంటుందని, వారి జీవిత భాగస్వామ్యులకు ఆ అవకాశం ఉండదని అధికారులు ప్రకటించారు. అంటే, హెచ్1బీ ఉద్యోగులు దేశం విడిచి వెళ్లకుండానే తమ వీసాలను రెన్యువల్ చేసుకోగలిగినప్పటికీ, వారి జీవిత భాగస్వాములు అలా తమ వీసాలను పునరుద్ధరించుకోలేరు. ఈ డొమెస్టిక్ రెన్యువల్ ఫెసిలిటీ వీసా హోల్డర్లకు మాత్రమే ఉంటుంది.
హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ నుంచే తమ వీసాలను రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఒక పైలట్ ప్రాజెక్టును యూఎస్ ప్రారంభించింది. అయితే, ఈ ప్రాజెక్టులో భాగంగా 20 వేల మందికి ఆ అవకాశం కల్పిస్తారు. ఈ సదుపాయం వినియోగించుకోవాలనుకునే ఉద్యోగులు.. రెన్యువల్ చేసుకునే సమయం వచ్చిన తమ వీసాలను యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ కు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఆ వీసా ల రెన్యువల్ ప్రాసెస్ ను పూర్తి చేసి, తిరిగి, పాస్ పోర్ట్ తో పాటు నూతన వీసాను వారికి పంపిస్తారు.