Earthquake today : 4 రాష్ట్రాల్లో భూకంపాలు.. భయాందోళనలో ప్రజలు!
Earthquake today : దేశంలోని 4 రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం భూకంపాలు వెలుగులోకి వచ్చాయి. కాగా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
Earthquake today in India : ఇండియాలో శుక్రవారం ఉదయం నుంచి 4 రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించాయి. భూ ప్రకంపనల తీవ్రత అధికంగా లేకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. భూమి కంపించడంతో, అనేక ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది.
ఈ 4 రాష్ట్రాల్లో భూకంపాలు..
కర్ణాటకలోని విజయపురా జిల్లాలో శుక్రవారం ఉదయం 6 గంటల 50 నిమిషాల ప్రాంతంలో.. 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి 10 కి.మీల దిగువున ప్రకంపనలు వెలుగు చూసినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ తెలిపింది.
Tamil Nadu earthquake today : మరోవైపు.. ఉదయం 7 గంటల 40 నిమిషాల ప్రాంతంలో.. తమిళనాడులోని చెంగల్పట్టుకు సమీపంలో 3.2 తీవ్రతతో భూమి కంపించింది. భూమికి 10కి.మీల దిగువన భూకంపం నమోదైంది.
గంట తర్వాత.. ఈశాన్య భారత దేశంలోని మేఘాలయలో కూడా భూకంపం సంభవించింది. రికార్ట్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. షిల్లాంగ్‌కు 18కి.మీల నైరుతి వైపు ఈ భూకంపం వెలుగులోకి వచ్చింది.
Karnataka earthquake today : కాగా.. చివరి భూకంపం.. గుజరాత్లో వెలుగులోకి వచ్చింది. రాజ్‌కోట్‌లో ఉదయం 9 గంటల ప్రాంతంలో.. రిక్టార్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూమి కంపించింది. భూమికి 20కి.మీల దిగువన భూకంపం నమోదవ్వడంతో పెద్దగా ప్రభావం చూపించలేదు.
భూకంపాల తీవ్రత అధికంగా లేనందున.. 4 రాష్ట్రాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.
భూకంపాలు పెరుగుతున్నాయి..!
India earthquake latest news : దేశంలో భూకంపాల ఘటనలు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు నేపాల్‌లో భూకంపం సంభవించినా.. ఈ ప్రాంతాల్లో భూమి కంపించడం ఆందోళనకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి సమయంలో అందరు నిద్రిస్తున్న వేళ భూకంపాలు వెలుగుచూడటం, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడం జరుగుతోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూనే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఐస్‌ల్యాండ్‌లో అక్టోబర్ నెలలో 14 గంటల వ్యవధిలో ఏకంగా 800కుపైగా భూకంపాలు నమోదయ్యాయి. ఫలితంగా.. అక్కడి ప్రభుత్వం, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది. ఐస్‌ల్యాండ్‌లోని నైరుతి ప్రాంతంలో ఉన్న రేక్జాన్స్ ద్వీపకల్పాన్ని భూప్రకంపనలు వణికించాయి. అయితే.. ఆ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతం బద్ధలయ్యే ముందు, భూకంపాలు సంభవిస్తున్నాయని, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం