Delhi air pollution : వాయు కాలుష్యం ఎఫెక్ట్​.. దిల్లీలో స్కూళ్లు బంద్​!-delhi primary schools closed till nov 10 due to air pollution ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Air Pollution : వాయు కాలుష్యం ఎఫెక్ట్​.. దిల్లీలో స్కూళ్లు బంద్​!

Delhi air pollution : వాయు కాలుష్యం ఎఫెక్ట్​.. దిల్లీలో స్కూళ్లు బంద్​!

HT Education Desk HT Telugu
Nov 05, 2023 02:45 PM IST

Delhi air pollution : దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వాయు కాలుష్యం ఎఫెక్ట్​.. దిల్లీలో స్కూళ్లు బంద్​!
వాయు కాలుష్యం ఎఫెక్ట్​.. దిల్లీలో స్కూళ్లు బంద్​!

Delhi air pollution : దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యత రోజురోజుకు పతనమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యం నేపథ్యంలో.. ప్రైమరీ స్కూళ్లను ఈ నెల 10 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. 6-12 తరగతుల విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాస్​లు నిర్వహించాలని వెల్లడించింది.

"దిల్లీలో వాయు కాలుష్యం స్థాయి చాలా ఎక్కువగా ఉంది. అందుకే.. ఈ నెల 10 వరకు ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నాము. 6-12 తరగతుల వారికి భౌతిక క్లాసులు కాకుండా.. ఆన్​లైన్​లో పాఠాలు చెప్పాలి," అని దిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశి ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

వాస్తవానికి.. దిల్లీలో శుక్రవారమే వాయు నాణ్యత దారుణంగా పతనమైంది. ఫలితంగా.. ప్రైవేటు- ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు సెలవు ప్రకటించారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​.

ఆదివారం పరిస్థితి ఇలా..

Delhi air quality today : ఆదివారం ఉదయం.. దిల్లీలో వాయు నాణ్యత దారుణంగా మారింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 15.8 డిగ్రీలకు చేరింది. సాధారణ కన్నా ఇది ఒక డిగ్రీ ఎక్కువే. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల మధ్యలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 460 నుంచి 415కి పడిపోయింది.

ఏక్యూఐ అనేది 0-50 మధ్యలో ఉంటే అది సాధారణంగా పరిగణిస్తారు. 51-100గా ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్టు. 101-200గా నమోదైతే మాడరేట్​గా ఉందని అర్థం. 201-300గా ఉంటే వాయు నాణ్యత క్షీణిస్తోందని తెలుసుకోవాలి. 301-400 మధ్యలో ఉంటే వాయు నాణ్యత వేగంగా పడిపోతోందని, 401-500 మధ్యలో ఉంటే పరిస్థితి విషమిస్తోందని అర్థం చేసుకోవాలి. ఇక 500 దాటితే.. పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్టు.

తాజా పరిస్థితుల మధ్య దిల్లీ ప్రజల్లో అనారోగ్య సమస్యలు సైతం మొదలయ్యాయి. చాలా మంది.. తమ కళ్లు నొప్పులుగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నారు.

ఈ మూడు నగరాల్లో పరిస్థితి ఆందోళనకరం..!

దిల్లీతో పాటు దేశంలోని మరో రెండు నగరాల్లో వాయు కాలుష్యం చాలా ఆందోళనకరంగా మారింది. స్విస్​ గ్రూప్​ ఐక్యూఎయిర్​ ప్రకారం.. ఆదివారం, వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉన్న ప్రపంచ దేశాల్లోని టాప్​-10 నగరాల్లో.. మూడు ఇండియాలోనే ఉన్నాయి. అవి దిల్లీ, ముంబై, కోల్​కతా.

Delhi air quality worsens to severe plus : వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తున్న నగరాల్లో దిల్లీ అయితే ఏకంగా మొదటి స్థానంలో ఉండటం విశేషం. కోల్​కతా 3వ స్థానం, ముంబై 6వ స్థానంలో ఉంది. లాహోర్​ 2వ స్థానం, ధాకా 4, కరాచీ 5వ స్థానాల్లో ఉన్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం