CTET Result 2023 : సీటెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
CTET Result 2023 : సీబీఎస్సీ సీటెట్ 2023 ఫలితాలు విడుదల అయ్యాయి. కటాఫ్ మార్క్, డౌన్లోడ్ లింక్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
CTET Result 2023 : 2023 సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది సీబీఎస్ఈ. అభ్యర్థులు.. తమ 2023 సీటెట్ పరీక్ష ఫలితాలను ctet.nic.in లో చెక్ చేసుకోవచ్చు.
సీటెట్ ఫలితాలు..
ఈ ఏడాది ఆగస్ట్ 20న సీటెట్ 2023 పరీక్ష జరిగింది. 29లక్షల మంది అభ్యర్థులు ఈసారి ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 80శాతానికిపైగా మంది ఎగ్జామ్‌కు హాజరయ్యారు. 15,01,719 మంది పేపర్ 1 (క్లాస్ 1-5) కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక పేపర్ 2 (క్లాస్ 6-8) కు 14,02,184 మంది రిజిస్టర్ అయ్యారు.
సీటెట్ 2023 కోసం కటాఫ్ మార్క్‌ను 60శాతంగా నిర్ణయించింది సీబీఎస్ఈ. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు స్కూల్ మేనేజ్మెంట్ ఇందులో కాస్త సడలింపును ఇచ్చే అవకాశం ఉంది.
CTET Result 2023 link : ఇక పరీక్ష రాసిన వారిలో 4 లక్షల మంది అభ్యర్థులు.. ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. పేపర్ 1కు 12,13,704 మంది హాజరవ్వగా.. 2,98,758 మంది క్వాలిఫై అయ్యారు. ఇక పేపర్ 2కు 11,66,178 మంది హాజరవ్వగా 1,01,057 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని ఇప్పటికే విడుదల చేసింది సీబీఎస్సీ. తుది కీ ఆధారంగా ఈ రిజల్ట్‌ను రూపొందించినట్టు ప్రకటించింది.
సీటెట్ ఎగ్జామ్ రిజల్ట్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2023 సీటెట్ పరీక్ష ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
- స్టెప్ 1:- ముందుగా సీటెట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
- CTET Result 2023 download link స్టెప్ 2:- రిజల్ట్ డౌన్లోడ్ లింక్ మీద ప్రెస్ చేయండి.
- స్టెప్ 3:- మీ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి, లాగిన్ అవ్వండి.
- స్టెప్ 4:- సీబీఎస్ఈ సీటెట్ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
సంబంధిత కథనం