Rape : నర్సింగ్ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి ఆటో డ్రైవర్ అత్యాచారం-crime news 19 year old nursing student raped by auto driver in ratnagiri maharashtra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rape : నర్సింగ్ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి ఆటో డ్రైవర్ అత్యాచారం

Rape : నర్సింగ్ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి ఆటో డ్రైవర్ అత్యాచారం

Anand Sai HT Telugu
Aug 27, 2024 11:04 AM IST

Crime News : కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యం
ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యం

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం మహిళ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రత్నగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సింగ్ విద్యార్థిని అయిన అమ్మాయి.. ఆటో డ్రైవర్ తనకు తాగే నీటిలో మత్తుమందు కలిపి ఇచ్చాడని, తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మాయి ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా డ్రైవర్‌ను నీరు అడిగింది. నిందితుడు నీటిలో కొంత మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఆ తర్వాత మహిళ స్పృహతప్పి పడిపోయింది. దీంతో డ్రైవర్ ఆమెను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహిళ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది, నిందితుడు పరారీలో ఉన్నాడు.

భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(1) కింద రత్నగిరి పోలీసులు ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు మేరకు చంపక్ మైదాన్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహిళ వైద్య పరీక్షల నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు మహిళ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వెలుపల పలువురు నర్సులు నిరసనకు దిగారు.

ఇంకోవైపు ఈ నెల ప్రారంభంలో కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహం ఆగస్టు 9న ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో కనిపించింది. ఈ కేసుకు సంబంధించి కోల్‌కతా పోలీసు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు.

తర్వాత అతడికి పాలిగ్రాఫ్ పరీక్ష చేశారు. మరికొంతమంది ఆసుపత్రి స్టాఫ్‌కు టెస్ట్ జరిగింది. నిందితుడు సంజయ్‌ రాయ్‌ గురించి విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు అతడు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్టుగా తెలిసింది.

టాపిక్