CBSE class 12 results 2024 : సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్ చేసుకోండి..
CBSE class 12 results 2024 : సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలు విడుదలయ్యాయి. డిజీలాకర్‌లో ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
CBSE results 2024 class 12 : సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలు విడుదలయ్యాయి. డిజీలాకర్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్జ్యుకేషన్ అధికారిక్ వెబ్సైట్ cbse.nic.in లో కూడా సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షల కోసం 16,33,730 విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నట్టు.. వీరిలో 16,21,224 మంది పరీక్షకు హాజరైనట్టు సీబీఎస్ఈ తెలిపింది. ఇక పరీక్ష రాసిన వారిలో 14,26,420 మంది పాస్ అయినట్టు పేర్కొంది. సీబీఎస్ఈ క్లాస్ 12 ఉత్తీర్ణత శాతం 87.9గా ఉంది. గతేడాది ఇది 87.33శాతంగా ఉండేది.
సీబీఎస్ఈ ఫలితాలు 2024 చెక్ చేసుకునేందుకు డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలు 2024 ని ఇలా చెక్ చేసుకోండి..
డిజీలాకర్‌లో సీబీఎస్ఈ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి..
స్టెప్ 1:- డిజీలాకర్ యాప్ లేదా వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- అకౌంట్ ఉంటే సైన్-ఇన్ చేసుకోండి. లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
CBSE 12th result 2024 date : స్టెప్ 3:- హోం పేజ్‌లోకి వెళ్లి.. సీబీఎస్ఈ రిజల్ట్స్ లింక్ కోసం చూడండి. దాని మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4:- సంబంధిత వివరాలను సబ్మీట్ చేయండి. స్కోర్ డిస్ప్లే అవుతుంది.
సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 బోర్డు పరీక్షల మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్, జవాబు పత్రాల స్కాన్ కాపీల కోసం మే 11న సీబీఎస్ఈ షెడ్యూల్‌ని విడుదల చేసింది. సీబీఎస్ఈ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం.. తమ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్, జవాబు పత్రాల స్కాన్ కాపీల కోసం నిర్ణీత షెడ్యూల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ తర్వాత ఆఫ్‌లైన్ మోడ్‌లో ఎటువంటి అభ్యర్థనను బోర్డు ఆమోదించదు.
CBSE class 12 results out : 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. సబ్జెక్టును బట్టి రెండు నుంచి మూడు గంటల పాటు సింగిల్ షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్ష సమయం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు లేదా మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉండేది.
ఇక ఇప్పుడు సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు మిగిలిపోయాయి. ఇవి కూడా ఈ వారంలోనే విడుదల అవుతాయని సమాచారం. వాస్తవానికి.. సీబీఎస్ఈ ఫలితాలను మే 20 తర్వాత విడుదల చేస్తామని తొలుత చెప్పారు. కానీ.. ఈ వారంలోనే అన్ని పరీక్షల ఫలితాలు బయటకు వస్తాయని తెలుస్తోంది.
సంబంధిత కథనం