TS EAPCET Results 2024 : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్... వెబ్ సైట్ లో ప్రిలిమినరీ 'కీ'లు, ఫలితాలు ఎప్పుడంటే..?
TS EAPCET Results 2024 Updates : తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) - 2024 పరీక్షలు ముగిశాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
TS EAPCET Results 2024 Updates : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) పరీక్షలు శనివారంతో ముగిశాయి. మే 7వ తేదీన ప్రారంభమైన ఈ ఎగ్జామ్స్.... 11వ తేదీతో పూర్తి అయ్యాయి.
మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ప్రవేశాలకు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇక మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ వారు ఎగ్జామ్స్ రాశారు.ఈ ఏడాది ఈఏపీసెట్ ను జెఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తుంది. 2024-2025 విద్యాసంవత్సరానికి తెలంగాణలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈఏపీసెట్ 2024 నిర్వహించారు.
ఈ ఏడాది ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. 2,54,543 మంది అప్లయ్ చేసుకోగా... అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కు 1,00,260 మంది విద్యార్థులు అప్లయ్ చేశారు. గతేడాది ఈ మూడు స్ట్రీమ్ లకు కలిపి కలిపి 3,20,683 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి వచ్చిన దరఖాస్తులు అధికంగా ఉన్నాయి.
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాలు ఎప్పుడంటే...?
తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు పూర్తి కావటంతో ఫలితాలపై దృష్టిపెట్టారు అధికారులు. మొత్తం ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే.... మే 25వ తేదీలోపు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇది కుదరకపోతే మే 27వ తేదీలోపు దాదాపుగా ప్రకటించవచ్చు. రిజల్ట్స్ పై ప్రకటన త్వరలోనే జేఎన్టీయూ అధికారికంగా ప్రకటన చేయనుంది. ఫలితాలు విడుదలైతే… కౌన్సిలింగ్ తేదీలు ఖరారవుతాయి.
వెబ్ సైట్ లో ప్రాథమిక కీ లు…
TS EAPCET Answwr Keys 2024: మరోవైపు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 7, 8 తేదీల్లో నిర్వహించిన ఈఏపీసెట్(ఎంసెట్) పరీక్షలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రాథమిక కీ లను వెబ్ సైట్ లో ఉంచారు. రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాలను కూడా విడుదల చేశారు. వీటిని https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలు ఉంటే మే 13వ తేదీలోపు తెలియజేయవచ్చు.
మరోవైపు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ లను ఇవాళ(మే 12) విడుదల చేయనున్నారు. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రాథమిక కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 14వ తేదీ ఉదయం 10లోపు పంపే అవకాశం ఉంటుంది.
HT తెలుగులో ఈఏపీసెట్ ఫలితాలు...
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈఏపీసెట్(ఎంసెట్ ) ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు.
- విద్యార్థులు హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ https://telugu.hindustantimes.com/telangana-board-result లోకి వెళ్లాలి.
- తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు - 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.
ఈఏపీసెట్ వెబ్ సైట్ లో ఇలా చూసుకోండి..
Step 1 : ముందుగా అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2 : హోం పేజీలో TS EAPCET Results 2024 సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3 : అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
Step 4 : మీ రిజల్ట్(స్కోర్ మరియు ర్యాంక్ కార్డు) స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. ఫలితాల కాపీని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోండి.