CTET 2024 : సీటెట్​పై కీలక్​ అప్డేట్​.. ఎగ్జామ్​ డేట్​ ఇదే! అప్లికేషన్​ ప్రక్రియ షురూ-cbse announces exam schedule for teacher eligibility test ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ctet 2024 : సీటెట్​పై కీలక్​ అప్డేట్​.. ఎగ్జామ్​ డేట్​ ఇదే! అప్లికేషన్​ ప్రక్రియ షురూ

CTET 2024 : సీటెట్​పై కీలక్​ అప్డేట్​.. ఎగ్జామ్​ డేట్​ ఇదే! అప్లికేషన్​ ప్రక్రియ షురూ

Sharath Chitturi HT Telugu
Nov 04, 2023 12:05 PM IST

CTET 2024 : సీటెట్​కు ప్రిపేర్​ అవుతున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన అప్డేట్​. సీటెట్​-2024 పరీక్ష తేదీ వచ్చేసింది.

సీటెట్​ 2024పై కీలక్​ అప్డేట్​.. ఎగ్జామ్​ డేట్​ ఇదే!
సీటెట్​ 2024పై కీలక్​ అప్డేట్​.. ఎగ్జామ్​ డేట్​ ఇదే!

CTET 2024 exam date : సీటెట్​ (సెంట్రల్​ టీచర్స్​ ఎలిజెబులిటీ టెస్ట్​) 18వ ఎడిషన్​కు సంబంధించిన అప్లికేషన్​- ఎగ్జామ్​ షెడ్యూల్​ను ప్రకటించింది సీబీఎస్​ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్జ్యుకేషన్​). 2024 జనవరి 21న పరీక్ష జరగనుంది. ఈ దఫా సీటెట్​ రాయాలని భావిస్తున్న వారు.. అధికారిక వెబ్​సైట్​లో రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ నెల 23తో అప్లికేషన్​ ప్రక్రియ గడువు ముగుస్తుంది.

ఈ దఫా సీటెట్​-2024 పరీక్షను 135 నగరాల్లో, 20 భాషాల్లో నిర్వహిస్తున్నారు.

"ఎగ్జామ్​, సిలబస్​, భాషలు, ఎలిజెబులిటీ, ఎగ్జామ్​ ఫీజు, ముఖ్యమైన తేదీలకు సంబంధించిన వివరాలు సీటెట్​ అధికారిక వెబ్​సైట్​లో ఉంటుంది. అభ్యర్థులు.. ఆ నోటిపికేషన్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి," అని సీబీఎస్​ఈ వెల్లడించింది.

CTET 2024 apply online : 1-8 క్లాసులకు టీచర్​గా ఉద్యోగం పొందాలంటే.. సీటెట్​ క్వాలిఫికేషన్​ ఉండాలి. ఈ సీటెట్​లో రెండు పేపర్లు ఉంటాయి. జెనరల్​/ఓబీసీలకు సీటెట్​ ఎగ్జామ్​ ఫీజు రూ. 1000 (పేపర్​ 1 లేదా పేపర్​ 2), రూ. 1200 ( పేపర్​ 1, పేపర్​ 2 కలిపి)గా ఉంది. ఎస్​సీ/ ఎస్​టీ/వికలాంగులకు రూ. 500 (పేపర్​ 1 లేదా పేపర్​ 2), రూ. 600 (రెండు పేపర్లు కలిపి)గా ఉంది.

సీటెట్​ 2024 కోసం ఇలా అప్లై చేసుకోండి..

స్టెప్​ 1:- ctet.nic.in లోకి వెళ్లండి.

స్టెప్​ 1:- 'అప్లై ఆన్​లైన్​' ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

CTET 2024 notification : స్టెప్​ 1:- ఆన్​లైన్​ అప్లికేషన్​ ఫామ్​ ఫిల్​ చేయండి.

స్టెప్​ 1:- స్కాన్​ చేసిన ఫొటో, సిగ్నేచర్​ని అప్లోడ్​ చేయండి. సంబంధిత డాక్యుమెంట్స్​ని కూడా అప్లోడ్​ చేయండి.

స్టెప్​ 1:- ఎగ్జామ్​ ఫీజు చెల్లించండి.

స్టెప్​ 1:- కన్ఫర్మేషన్​ పేజ్​ ఓపెన్​ అవుతుంది. దానిని ప్రింటౌట్​ తీసుకోండి.

సీటెట్​- 2024 అప్లికేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జేఈఈ మెయిన్​ అప్లికేషన్​ ప్రక్రియ షురూ..

JEE Main registration : జేఈఈ మెయిన్ 2024ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ నవంబర్ 2వ తేదీన మొదలంది. jeemain.nta.nic.inలోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన తరువాత విద్యార్థులకు జేఈఈ మెయిన్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవడానికి సుమారు నెల రోజుల సమయం లభిస్తుంది. ఈ లోపు విద్యార్థులు అన్ని డాక్యుమెంట్స్ తో సిద్ధంగా ఉండడం మంచిది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం