JEE Main 2024: జేఈఈ మెయిన్ కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం; ఇలా రిజిస్టర్ చేసుకోండి..-jee main 2024 nta may start registration process today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main 2024: జేఈఈ మెయిన్ కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం; ఇలా రిజిస్టర్ చేసుకోండి..

JEE Main 2024: జేఈఈ మెయిన్ కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం; ఇలా రిజిస్టర్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Nov 02, 2023 04:00 PM IST

JEE Main 2024: జేఈఈ మెయిన్ 2024 కు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదల అయింది. నవంబర్ 2వ తేదీ నుంచి జేఈఈ మెయిన్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

JEE Main 2024: జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సమాచారాన్ని ఎన్టీఏ గురువారం తన అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో ప్రకటించింది.

నెల పాటు అవకాశం

రిజిస్ట్రేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన తరువాత విద్యార్థులకు జేఈఈ మెయిన్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవడానికి సుమారు నెల రోజుల సమయం లభిస్తుంది. ఈ లోపు విద్యార్థులు అన్ని డాక్యుమెంట్స్ తో సిద్ధంగా ఉండడం మంచిది.

సిలబస్ లో మార్పు..

జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) సిలబస్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకు. అప్ డేటెడ్ సిలబస్ ను ఎన్టఏ త్వరలో అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో ప్రకటించనుంది. నీట్ యూజీ 2024 (NEET UG 2024) తరహాలోనే కొన్ని చాప్టర్లను జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) సిలబస్ నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్లికేషన్ ఫామ్ తో పాటు సవరించిన సిలబస్ వివరాలను కూడా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయనుంది.

పరీక్ష ఎప్పుడు?

జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) తొలి సెషన్ 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య జరుగుతుంది. ఆ తరువాత, రెండో సెషన్ 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీల మధ్య జరుగుతుంది. జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) పరీక్ష రాయాలనుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి వయో పరిమితి నిబంధనలు లేవు. 2021 లేదా 2022 లో క్లాస్ 12, లేదా ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం పాస్ అయిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. అలాగే, 2024 మార్చిలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే.

పరీక్ష పేపర్

జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) ప్రశ్నాపత్రం గత సంవత్సరాల ప్రశ్నాపత్రం తరహాలోనే ఉంటుంది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్నల్ చాయిస్ లతో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఒక్కో పేపర్ లో రెండు సెక్షన్లలో మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. జేఈఈ మెయిన్ 2024 పరీక్ష ద్వారా ప్రఖ్యాత విద్యా సంస్థల్లో బీఈ, బీటెక్, బీ ఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

ఇలా అప్లై చేయండి..

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. ను ఓపెన్ చేయండి.
  • హోం పేజీలో కనిపించే JEE Main 2024 session 1 registration లింక్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
  • ఆ తరువాత, మీ అకౌంట్ లోకి లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం సాఫ్ట్ కాపీని, హార్డ్ కాపీని భద్ర పర్చుకోవాలి.

Whats_app_banner