JEE Main 2024: జేఈఈ మెయిన్ 2024 పరీక్షకు అప్లై చేస్తున్నారా? ఈ డాక్యుమెంట్స్ మస్ట్
JEE Main 2024: జేఈఈ మెయిన్ 2024 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ముందుగా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ పరీక్షకు విద్యార్థులు ఎన్టీఏ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
JEE Main 2024: జాయింట్ ఎంట్రెన్స్ మెయిన్ ఎగ్జామినేషన్ 2024 (JEE Main 2024) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్ పరీక్ష రెండు సెషన్స్ లో జరుగుతుంది. త్వరలో ఈ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ ని సంబంధిత వెబ్ సైట్ లో పోస్ట్ చేస్తారు.
JEE Main 2024 exam dates: ఎగ్జామ్ ఎప్పుడు?
జేఈఈ మెయిన్ 20 24 మొదటి సెషన్ పరీక్ష 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరుగుతుంది. అలాగే జేఈఈ మెయిన్ రెండవ సెషన్ ఏప్రిల్ 1 తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు జరుగుతుంది. జేఈఈ మెయిన్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది.
JEE Main 2024 documents: ఈ డాక్యుమెంట్స్ మస్ట్..
జేఈఈ మెయిన్ 20 24 పరీక్షకు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు ముందుగా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను సిద్ధం చేసి పెట్టుకోవాలి. గత సంవత్సరపు సమాచారం ప్రకారం.. జేఈఈ మెయిన్ 2024 పరీక్షకు అప్లై చేసే సమయంలో ఈ క్రింది డాక్యుమెంట్స్ అవసరమవుతాయి.
- విద్యార్థులు అప్లికేషన్ ఫామ్ లో తమ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్ స్కాన్డ్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ఒక తెల్ల కాగితంపై సంతకం చేసి, ఆ పేపర్ ను నీట్ గా స్కాన్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి.
- ఒకవేళ దివ్యాంగులు అయితే సంబంధిత నిర్ధారిత పత్రం స్కాన్డ్ కాపీ ని సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీల విద్యార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాల స్కాన్డ్ కాపీలను రడీ చేసుకోవాలి.
JEE Main 2024 rules: ఇవి మర్చిపోవద్దు
- విద్యార్థి ఫోటో గ్రాఫ్ కలర్ లో ఉండొచ్చు లేదా బ్లాక్ అండ్ వైట్ లో ఉండొచ్చు. ముఖంపై మాస్క్ లేకుండా ఉండాలి. ఫోటోలో 80% ముఖం ఉండాలి. వైట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ ఫోటో తీసుకుని ఉండాలి. అలాగే స్కాన్డ్ కాపీ జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. ఫొటో స్కాన్డ్ కాపీ స్పష్టంగా ఉండాలి.
- ఫొటోగ్రాఫ్ స్కాన్డ్ కాపీ సైజు 10 కేబీ నుంచి 200 కేబీ మధ్యలో ఉండాలి.
- సిగ్నేచర్ ఉన్న స్కాన్డ్ కాపీ సైజు 4 కేబీ నుంచి 30 కేబీ మధ్య ఉండాలి.
- కేటగిరి సర్టిఫికెట్స్ స్కాన్డ్ కాపీలు పిడిఎఫ్ లో 50 కేబీ నుంచి 300 కేబీ మధ్య స్పష్టంగా కనిపించేలా ఉండాలి. వేరే వారి ఫొటోస్ గాని సిగ్నేచర్ కానీ సర్టిఫికెట్స్ కానీ ఉపయోగించకూడదు.