CBSE Class 10 Compartment Result : సీబీఎస్ఈ క్లాస్ 10 కంపార్ట్మెంట్ ఫలితాలు విడుదల
CBSE Class 10 Compartment Result 2022 : 10వ తరగతి కంపార్ట్మెంట్ పరీక్షల ఫలితాలను వెల్లడించింది సీబీఎస్ఈ. ఇలా చెక్ చేసుకోండి.
సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ ఫలితాలు విడుదల
CBSE Class 10 Compartment Result in telugu : సీబీఎస్ఈ 10వ తరగతి కంపార్ట్మెంట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 10వ తరగతి కంపార్ట్మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు.. cbse.gov.in/ cbseresults.nic.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ పరీక్షలు ఆగస్టు 23-29 మధ్య జరిగాయి. వీటితో పాటు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసి వారు కూడా తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లు cbse.gov.in/ cbseresults.nic.in లో చెక్ చేసుకోవచ్చు.
ఇలా చెక్ చేసుకోండి..
- ముందుగా cbse.gov.in వెబ్సైట్లోకి వెళ్లండి
- హోం పేజీలో 'CBSE 10th class Compartment Result ' లింక్‌ను క్లిక్ చేయండి.
- మీ రోల్ నెంబర్ టైప్ చేయండి. 5 డిజిట్ స్కూల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కూడా టైప్ చేయాల్సి ఉంటుంది.
- సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. మీ సీబీఎస్ఈ 10వ తరగతి కంపార్ట్మెంట్ పరీక్షల ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి.
సీబీఎస్ఈ బోర్డు రెండు పర్యాయాలు బోర్డు పరీక్షలను నిర్వహించింది. 12వ తరగతి మొత్తం ఉత్తీర్ణత శాతం 92.71 శాతంగా ఉంది. 10వ తరగతిలో 94.40 శాతంగా ఉంది.
సంబంధిత కథనం