Barbie makeover : బార్బీ మేకోవర్​లో రాజకీయ నేతల ఫొటోలు.. మోదీ, సోనియా పిక్స్​ హైలైట్​!-ai artist gives barbie makeover to politicians see pics ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Barbie Makeover : బార్బీ మేకోవర్​లో రాజకీయ నేతల ఫొటోలు.. మోదీ, సోనియా పిక్స్​ హైలైట్​!

Barbie makeover : బార్బీ మేకోవర్​లో రాజకీయ నేతల ఫొటోలు.. మోదీ, సోనియా పిక్స్​ హైలైట్​!

Sharath Chitturi HT Telugu
Jul 29, 2023 11:15 AM IST

Barbie makeover to politicians : ఏఐ ఆర్టిస్ట్​లు అద్భుతాలు సృష్టిస్తున్నారు! ఇలాంటిదే ఒకటి ఈ ‘బార్బీ మేకోవర్​’. దేశంలోని రాజకీయ నేతలకు సంబంధించిన బార్బీ మేకోవర్​ ఫొటోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

 బార్బీ మేకోవర్​లో రాజకీయ నేతల ఫొటోలు..
బార్బీ మేకోవర్​లో రాజకీయ నేతల ఫొటోలు.. (Instagram/ whoworewhat.club)

Barbie makeover to politicians : ఇప్పుడు ప్రపంచమంతటా 'బార్బీ' హడావుడే నడుస్తోంది. ఈ మచ్​ అవైటెడ్​ హాలీవుడ్​ సినిమాపై అందరు ఫోకస్​ చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు.. ఇప్పటికే బార్బీ మేకోవర్​లో సినిమాను వీక్షించారు. ఈ క్రమంలో ఓ ఏఐ ఆర్టిస్ట్​ ఈ మేకోవర్​ను సీరియస్​గానే తీసుకున్నాడు! ఈ నేపథ్యంలో రాజకీయ నేతలకు బార్బీ మేకోవర్​ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

మోదీ, సోనియా, మమత ఫొటోలు హైలైట్​..!

'హూ వోర్​ వాట్​' అనే ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​.. ఈ ఫొటోలను పోస్ట్​ చేసింది. 'వీరిలో మీ ఫేవరెట్​ ఎవరు? ఇక్కడ బార్బీ ఉంది, బార్బీ ప్రతి చోట ఉంది,' అని క్యాప్షన్​ ఇచ్చింది. ఈ ఫొటోల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​, దిల్లీ- పశ్చిమ్​ బెంగాల్​ సీఎంలు అరవింద్​ కేజ్రీవాల్​, మమతా బెనర్జీలు, బీజేపీ సీనియర్​ నేతలు అమిత్​ షా, నితిన్​ గడ్కరీలు ఉన్నారు. వీరందరికి పింక్​ షర్ట్​, పింక్​ ప్యాంట్​, పింక్​ బెలూన్లు వంటివి యాడ్​ చేశారు ఏఐ ఆర్టిస్ట్​లు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన ఫొటోలను ఇక్కడ చూడండి:

Barbie makeover AI artist : ఈ పోస్ట్​కు 4వేలకుపైగా లైక్స్​ వచ్చాయి. చాలా మంది.. ఏఐ ఆర్టిస్ట్​ పనితనాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. "ఇది చాలా సరదాగా ఉంది", అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. 'అందరు బీఆర్​ఎస్​ నేతలుగా ఉన్నారు,' అని మరో వ్యక్తి కామెంట్​ చేశాడు.

బార్బీ లుక్‌లో బాలీవుడ్ హీరోయిన్లు..

Barbie makeover : బార్బీ బొమ్మ కు ఫ్యాన్స్ కానీవారు ఎవ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. చ‌క్క‌టి రూపంతో ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానే ఆక‌ట్టుకుంటుంటాయి బార్బీ బొమ్మ‌లు. బార్బీ చ‌రిత్ర‌తో ఇటీవ‌లే రూపొందిన హాలీవుడ్ మూవీ బార్బీ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా చ‌క్క‌టి ఆద‌ర‌ణ‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కొందరు ఏఐ ఆర్టిస్ట్​లు బాలీవుడ్​ హీరోయిన్లకు బార్బీ మేకోవర్​ ఇచ్చారు. ఆ ఫొటోలను చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం