PM Modi: ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోదీ ఐదేళ్ల క్రితమే ఊహించారు తెలుసా..? పార్లమెంట్లోనే ఆ విషయం చెప్పారు..-when pm modi predicted 2023s no confidence motion in 2018 video viral ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi: ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోదీ ఐదేళ్ల క్రితమే ఊహించారు తెలుసా..? పార్లమెంట్లోనే ఆ విషయం చెప్పారు..

PM Modi: ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోదీ ఐదేళ్ల క్రితమే ఊహించారు తెలుసా..? పార్లమెంట్లోనే ఆ విషయం చెప్పారు..

HT Telugu Desk HT Telugu
Jul 26, 2023 11:42 AM IST

no-confidence motion: పార్లమెంటు ఉభయ సభలు మరోసారి యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంపై విపక్షం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ తరఫున ఎంపీ గౌరవ్ గొగోయి, బీఆర్ఎస్ తరఫున ఎంపీ నామా నాగేశ్వర రావు అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన నోటీసులను స్పీకర్ కు అందజేశారు.

పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగం (ఫైల్ ఫోటో)
పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగం (ఫైల్ ఫోటో)

no-confidence motion: పార్లమెంటు ఉభయ సభలు మరోసారి యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంపై విపక్షం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ తరఫున ఎంపీ గౌరవ్ గొగోయి, బీఆర్ఎస్ తరఫున ఎంపీ నామా నాగేశ్వర రావు అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన నోటీసులను స్పీకర్ కు అందజేశారు.

స్పీకర్ నిర్ణయం

ఈ అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొదట, నిబంధనలకు అనుగుణంగా ఆ నోటీసులు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని, ప్రతీ నోటీసుకు 50 మంది ఎంపీల మద్దతు ఉందా? లేదా? అనే విషయాన్ని స్పీకర్ పరిశీలిస్తారు. ఆ తరువాత అవిశ్వాస తీర్మానం పై చర్చకు సమయాన్ని, తేదీని నిర్ణయిస్తారు. మణిపూర్ లో చెలరేగుతున్న హింసపై ప్రధాని మోదీ పార్లమంట్లో స్పందించాలని, ఆ అంశంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలన్న డిమాండ్ ను అధికార పక్షం పట్టించుకోకపోవడంతో.. విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానం నిర్ణయం తీసుకున్నాయి.

ఐదేళ్ల క్రితమే..

కాగా, విపక్షాలు ప్రవేశ పెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో.. ఐదేళ్ల క్రితం నాటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. 2023లో విపక్షాలు తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకువస్తారని 2018లొనే ప్రధాని మోదీ ఆ వీడియోలో చెప్పారు. 2018 లో ఇలాగే, లోక్ సభ ఎన్నికల ముందు విపక్షం నాటి మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ అవిశ్వాస తీర్మానం భారీ తేడాతో వీగిపోయింది. ఆ సందర్బంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మరోసారి 2023 లో కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధం కావాలని విపక్షానికి సూచించారు. అంటే, 2019 ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని నర్మగర్భంగా, పరోక్షంగా విపక్షానికి ప్రధాని మోదీ చెప్పారు. ఆయన ఊహించినట్లే.. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆయన ఊహించినట్లే.. విపక్షం మళ్లీ 2023 లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చింది. దాంతో, 2023 లో తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వస్తుందంటూ 2018 లోనే ఊహిస్తూ.. ప్రధాని మోదీ చేసిన ప్రసంగం వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 2018 లో నాటి మోదీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి దాదాపు అన్ని విపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. కానీ, 314 ఓట్లు సాధించి, ఆ తీర్మానాన్ని ప్రభుత్వ పక్షం ఓడించింది.