Sunny Leone : కానిస్టేబుల్​ పోస్ట్​ కోసం అప్లై చేసిన సన్నీ లియోనీ! అడ్మిట్​ కార్డ్​ ఫొటో వైరల్​!-actor sunny leones photo appears on up police recruitment exam admit card ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sunny Leone : కానిస్టేబుల్​ పోస్ట్​ కోసం అప్లై చేసిన సన్నీ లియోనీ! అడ్మిట్​ కార్డ్​ ఫొటో వైరల్​!

Sunny Leone : కానిస్టేబుల్​ పోస్ట్​ కోసం అప్లై చేసిన సన్నీ లియోనీ! అడ్మిట్​ కార్డ్​ ఫొటో వైరల్​!

Sharath Chitturi HT Telugu
Feb 18, 2024 09:00 AM IST

Sunny Leone admit card : ఉత్తర్​ ప్రదేశ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ పరీక్షకు చెందిన ఓ అడ్మిట్​ కార్డులో బాలీవుడ్​ నటి సన్నీ లియోనీ పేరు, ఫొటో కనిపించాయి. అడ్మిట్​ కార్డు ఫొటో ఇప్పుడు వైరల్​గా మారింది.

కానిస్టేబుల్​ పోస్ట్​ కోసం అప్లై చేసిన సన్నీ లియోనీ!
కానిస్టేబుల్​ పోస్ట్​ కోసం అప్లై చేసిన సన్నీ లియోనీ! (Sunil Khandare )

Sunny Leone UP Police recruitment exam : ప్రముఖ బాలీవుడ్​ నటి సన్నీ లియోనీ.. ఉత్తర్​ ప్రదేశ్​ పోలీస్​ కానిస్టేబుల్​ రిక్రూట్​ పరీక్షకు అప్లై చేసినట్టు వార్తలు తెగ వైరల్​ అవుతున్నాయి. రిక్రూట్​మెంట్​కు సంబంధించిన అడ్మిట్​ కార్డులో సన్నీ లియోనీ​ ఫొటో ఉండటం ఇందుకు కారణం. ఆ ఫొటో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే.. ఈ వార్తలో నిజం లేదు! ఎవరో.. ఆమె ఫొటోను అప్లోడ్​ చేసి, పరీక్షకు అప్లై చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది..

కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి.. ఉత్తర్​ ప్రదేశ్​ పోలీస్​ రిక్రూట్​మెంట్​ అండ్​ ప్రొమోషన్​ బోర్డ్​.. గతంలో నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. యూపీపీఆర్​బీ వెబ్​సైట్​లో చూస్తే.. తాజాగా సన్నీ లియోనీ పేరు, ఆమె ఫొటోతో కూడిన అడ్మిట్​ కార్డు కనిపించింది.

ఫిబ్రవరి 17న పరీక్ష జరిగింది. కాగా.. బాలీవుడ్​ నటి పేరు, ఫొటో ఉన్న అడ్మిట్​ కార్డులో.. ఎగ్జామినేషన్​ సెంటర్​.. కన్నౌజ్​కు చెందిన సోనేశ్రీ మెమొరియల్​ గర్ల్స్​ కాలేజ్​ అని ఉంది. కానీ ఆ హాల్​ టికెట్​ మీద ఎవరు వచ్చి పరీక్ష రాయలేదని పరీక్షా కేంద్రంలోని సిబ్బంది చెప్పారు.

UP Police constable recruitment exam : కానీ.. సన్నీ లియోనీ పేరు, ఫొటోను వాడిన వార్త పోలీసుల దృష్టికి వెళ్లింది. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. రిజిస్ట్రేషన్​ కోసం ఇచ్చిన మొబైల్​​ నెంబర్​.. యూపీ మహోబాకు చెందిన ఓ వ్యక్తిది అని తేలింది. కానీ రిజిస్ట్రేషన్​ ఫామ్​లో చెప్పిన అడ్రెస్​ మాత్రం ముంబైలోది అని తేలింది. ఈ నేపథ్యంలో.. సన్నీ లియోనీ పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్​ కార్డు ఫేక్​ని పోలీసులు తేల్చారు. రిజిస్ట్రేషన్​ ప్రక్రియలో.. ఎవరో ఆమె ఫొటోను అప్లోడ్​ చేశారని స్పష్టం చేశారు. సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్టు వివరించారు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన సన్నీ లియోనీ అడ్మిట్​ కార్డు ఫొటోను ఇక్కడ చూడండి :

యూపీ పోలీస్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ ఎగ్జామ్​..

Sunny Leone latest news : యూపీలో కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ పరీక్ష.. శనివారం మొదలైంది. రెండు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. కాగా.. శనివారం ఒక్కరోజే.. రాష్ట్రవ్యాప్తంగా 120 మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారందరు.. ఇతరుల కోసం పరీక్షలు రాయడానికి వచ్చిన వారు అని పోలీసులు తెలిపారు. వీరిలో 15మంది.. కాపీ కొడుతూ, చీటింగ్​ చేస్తూ దొరికిపోయిన వారు ఉన్నారని స్పష్టం చేశారు.

సంబంధిత కథనం