Stray dogs killed girl : వీధి కుక్కల దాడిలో రెండేళ్ల చిన్నారి మృతి!-2 year old girl who suffered 60 dog bites succumbed to injuries in surat ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stray Dogs Killed Girl : వీధి కుక్కల దాడిలో రెండేళ్ల చిన్నారి మృతి!

Stray dogs killed girl : వీధి కుక్కల దాడిలో రెండేళ్ల చిన్నారి మృతి!

Sharath Chitturi HT Telugu
Feb 24, 2023 03:47 PM IST

Stray dogs killed girl in Surat : వీధి కుక్కల దాడిలో సూరత్​కు చెందిన ఓ 2ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆమె శరీరంపై 60కిపైగా గాయాలను వైద్యులు గుర్తించారు!

వీధి కుక్కల దాడిలో 2ఏళ్ల చిన్నారి మృతి
వీధి కుక్కల దాడిలో 2ఏళ్ల చిన్నారి మృతి (HT_PRINT)

Stray dogs killed girl in Surat : వీధి కుక్కల దాడికి మరో పసి ప్రాణం బలైంది. గుజరాత్​ సూరత్​లో ఓ రెండేళ్ల బాలికపై కొన్ని శునకాలు దాడి చేయగా.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.

yearly horoscope entry point

బాధితురాలి శరీరంలో 60కిపైగా గాయాలు..!

బాధిత బాలిక పేరు మర్సిల హెమ్రోన్​. ఆమె తండ్రి రవి ఖహర్​ ఓ వలస కార్మికుడు. వీరి కుటుంబం పశ్చిమ్​ బెంగాల్​ నుంచి వచ్చి సూరత్​లో స్థిరపడింది. తండ్రి పలు ప్రాజెక్ట్​ సైట్​లలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.

Stray dogs attacked girl : కాగా.. సూరత్​లోని డైమండ్​ బ్రౌజ్​ ప్రాజెక్ట్​ సైట్​ వద్ద ఆదివారం రాత్రి, కొన్ని శునకాలు బాధితురాలిపై దాడికి దిగాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆమె శరీరంపై వైద్యులు దాదాపు 60కిపైగా గాయాలను గుర్తించారు. వివిధ రూపాల్లో చికిత్స అందించి, ఆమెను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గురువారం ఆమె తుదిశ్వాస విడిచింది.

 బాలిక శరీరాన్ని పోస్టుమార్టం చేయగా.. దాడి తర్వాత అనేక అవయవాలు పనిచేయకుండా పోయాయని తేలింది. ఆమె తల భాగం మీద కూడా ఎన్నో గాయాలు అయ్యాయి. చికిత్స భాగంగా అమెకు 30కిపైగా యాంటీ రేబీస్​ ఇంజెక్షన్​లు ఇచ్చారు వైద్యులు. కానీ ఫలితం దక్కలేదు.

"చికిత్సలో భాగంగా లోతైన పరీక్ష నిర్వహించారు. 60 చిన్న, పెద్ద, తీవ్ర గాయాలను బాలిక శరీరంలో గుర్తించారు," అని ఎన్​సీహెచ్​ రెసిడెంట్​ మెడికల్​ ఆఫీసర్​ డా. కేతన్​ నాయక్​ మీడియాకు వివరించారు.

Stray dogs killed girl in Gujarat : "పీడియాట్రిక్స్​, గైనకాలజీ, సర్జరీ డిపార్ట్​మెంట్​లోని వైద్యులు.. చికిత్స నిర్వహించారు. కానీ ఫలితం దక్కలేదు. దాడి కారణంగా బాలిక షాక్​కు (సెప్టిసెమిక్​ షాక్​) గురైనట్టు తెలుస్తోంది. అదే సమయంలో పలు అవయవాలు పనిచేయడం ఆపేశాయి," అని నాయక్​ అన్నారు. సెప్టిసెమిక్​ షాక్​ అంటే.. బాధితుల రక్తపోటు.. అనూహ్యంగా, అత్యంత తీవ్రంగా పడిపోవడం. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం.

సూరత్​లో వీధి కుక్కల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నారులపై వీధి శునకాలు దాడి చేయడం.. రెండు నెలల్లో ఇది నాలుగోసారి. గత నాలుగు ఘటనల్లో.. మొత్తం మీద ఇద్దరు మరణించారు.

హైదరాబాద్​లో నాలుగేళ్ల చిన్నారి..

Street Dogs Killed young Boy : హైదరాబాద్​లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

టాపిక్