Sushanth singh Pet Dog Died: సుశాంత్ పెంపుడు కుక్క మృతి.. శునకంపై నెట్టింట ఎమోషనల్ పోస్టులు-bollywood hero sushant singh rajput pet dog died ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sushanth Singh Pet Dog Died: సుశాంత్ పెంపుడు కుక్క మృతి.. శునకంపై నెట్టింట ఎమోషనల్ పోస్టులు

Sushanth singh Pet Dog Died: సుశాంత్ పెంపుడు కుక్క మృతి.. శునకంపై నెట్టింట ఎమోషనల్ పోస్టులు

Maragani Govardhan HT Telugu
Jan 17, 2023 12:16 PM IST

Sushanth singh Pet Dog Died: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన పెంపుడు కుక్క ఫడ్జ్ మరణించింది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ శునకం మృతి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ శునకం మృతి

Sushanth singh Pet Dog Died: దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన దాదాపు మూడేళ్లు కావస్తుంది. అయినప్పటికీ ఇంకా అతడి తాలుకూ మెమొరీస్ అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అతడి మృతికి సంబంధించిన కేసు ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే సుశాంత్ ఎంతో ప్రేమగా పెంచుకున్న అతడి పెంపుడు కుక్క ఫడ్జ్ మరణించింది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

"ఫడ్జ్ తిరిగి రానంత దూరం వెళ్లిపోయావు. స్వర్గంలోని నీ స్నేహితుడి దగ్గరకు చేరిపోయావు. మేము కూడా ఏదోక రోజు నిన్ను అనుసరిస్తాం. అప్పటి వరకు మాకీ బాధ తప్పదు." అని ఎమోషనల్‌గా ట్వీట్ చేసింది. ఈ పోస్టుకు సుశాంత్, తాను కుక్కతో కలిసి దిగిన పాత ఫొటోను జత చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు శునకం మరణ వార్త విని విశేషంగా స్పందిస్తున్నారు.

యజమాని చనిపోయిన తర్వాత పెంపుడు కుక్క సంతోషంగా, ఎప్పటిలాగా మాములుగా ఉండలేదు. ఆ బాధతోనే ఇన్నేళ్లు బతికి చివరకు తన యజమానిని చేరుకుంది. అని ఓ యూజర్ స్పందించగా.. మిస్ యూ ఫడ్జ్ అంటూ మరొకరు స్పందించారు.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న తన గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. అతడి మరణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బదిలీ చేయడానికి ముందు ముంబయి పోలీసులు దర్యాప్తు చేశారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్, నటి రియా చక్రవర్తిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్