Monsoon : భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు- రుతుపవనాలతో ఆ రాష్ట్రంలో 45 రోజుల్లో 185 మంది మృతి!-185 killed in himachal pradesh since onset of monsoon ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monsoon : భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు- రుతుపవనాలతో ఆ రాష్ట్రంలో 45 రోజుల్లో 185 మంది మృతి!

Monsoon : భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు- రుతుపవనాలతో ఆ రాష్ట్రంలో 45 రోజుల్లో 185 మంది మృతి!

Sharath Chitturi HT Telugu
Aug 11, 2024 09:00 AM IST

హిమాచల్ ప్రదేశ్ లో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 185 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 325 మంది గాయపడ్డారు. కాంగ్రాలో 37 మంది, మండీలో 30 మంది, సోలన్ లో 20 మంది, సిమ్లా జిల్లాలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని రెవెన్యూ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాలు జూన్ 27న హిమాచల్ లో ప్రవేశించాయి.

హిమాచల్​ ప్రదేశ్ వర్షాలు..
హిమాచల్​ ప్రదేశ్ వర్షాలు.. (HT_PRINT)

హిమాచల్ ప్రదేశ్​లో రుతుపవనాలు బీభిత్సాన్ని సృష్టిస్తున్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 185 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 325 మంది గాయపడ్డారు. కాంగ్రాలో 37 మంది, మండీలో 30 మంది, సోలన్​లో 20 మంది, సిమ్లా జిల్లాలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని రెవెన్యూ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాలు జూన్ 27న హిమాచల్ లో ప్రవేశించాయి. అప్పటి నుంచి దాదాపు అన్ని జిల్లాల్లో రుతుపవనాలు విధ్వంసం సృష్టించాయి. అనేక ఇళ్లులు ధ్వంసమయ్యాయి. చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది.

రుతుపవనాలకు హిమాజల్​ ప్రదేశ్​ విలవిల..

హిమాచల్​ ప్రదేశ్​లో ఈ వర్షాకాలంలో ప్రమాదవశాత్తు మునిగిపోవడం, మేఘస్ఫోటనం, విద్యుదాఘాతం, చెట్లు, రాళ్లపై నుంచి పడిపోవడం వంటి వివిధ ప్రమాదాల వల్ల 103 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాకాలంలో ఇప్పటి వరకు 100 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, 200 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

జూన్ 27 నుంచి ఆగస్టు 8 వరకు రాష్ట్రంలో 38 మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు సంభవించగా, 19 కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

జల్ శక్తి శాఖ సేకరించిన సమాచారం ప్రకారం వర్షాకాలంలో 3,514 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. అలాగే రాష్ట్రంలో వానాకాలంలో మొత్తం 4,05,725 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 3,098 మంది రైతులు నష్టపోయారు.

మరోవైపు శిమ్లా, మండి, కులు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్డిఎంఎ) గణాంకాల ప్రకారం, జులై 31 రాత్రి వరుస మేఘస్ఫోటనం కారణంగా కులులోని నిర్మాణంద్, సైంజ్, మలానా, మండీలోని పధార్, సిమ్లాలోని రాంపూర్ సబ్డివిజన్లలో 55 మంది గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 28 మృతదేహాలను వెలికితీశారు. శిమ్లా, కులు జిల్లాల సరిహద్దులోని సమేజ్ గ్రామంలో 18 మంది గల్లంతయ్యారు.

హిమాచల్ ప్రదేశ్​లోని చంబా, కాంగ్రా, మండీ, సిర్మౌర్, సిమ్లా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం ఆకస్మిక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతకుముందు కులు జిల్లాకు కూడా ఆకస్మిక హెచ్చరికలు జారీ చేశారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుశాయి. ఐఎండీ శిమ్లా కార్యాలయం ప్రకారం, రాబోయే కొన్ని రోజుల పాటు చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్​ జారీ చేసింది.

135 రోడ్లు మూసివేత..

హిమాచల్​ప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో 135 రహదారులు మూసుకుపోయాయి. శుక్రవారం సాయంత్రం నుంచి నహన్ (సిర్మౌర్)లో అత్యధికంగా 17 సెంటీమీటర్లు, నగ్రోటా సూర్యన్​లో 9.0 సెంటీమీటర్లు, జుబ్బర్హట్టిలో 5.00 సెంటీమీటర్లు, కందఘాట్​లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వర్షాల కారణంగా 24 విద్యుత్, 56 నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడిందని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది.

సంబంధిత కథనం