TSPSC EO recruitment 2022: EO దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. అప్లై చేసుకోండిలా!-tspsc eo recruitment 2022 registration begins for extension officer posts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tspsc Eo Recruitment 2022: Eo దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. అప్లై చేసుకోండిలా!

TSPSC EO recruitment 2022: EO దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. అప్లై చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu
Sep 08, 2022 04:37 PM IST

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థుల నుండి TSPSC దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇక ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఎంపిక ప్రక్రియ, అర్హత, ఇతర వివరాలను దిగువ చెక్ చేయవచ్చు.

TSPSC మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
TSPSC మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హతగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ద్వారా సెప్టెంబర్ 29 సాయంత్రం 5.00 గంటల వరకు ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది .

అర్హతలు

ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ స్థానానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా హోమ్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/సోషల్ వర్క్‌ (OR) సోషియాలజీలో బ్యాచిలర్ డిగ్రీ (OR), ఫుడ్‌ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థులు నోటిఫికేషన్‌ ద్వారా పూర్తి అర్హత సంబందించిన వివరాల గురించి తెలుసుకోవచ్చు.

వయోపరిమితి:

జూలై 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము:

అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ. 200, పరీక్ష రుసుము రూ. 80 చెల్లించాలి. పరీక్ష రుసుము చెల్లింపు నుండి నిరుద్యోగులందరికీ మినహాయింపు ఉంది. ఏదైనా ప్రభుత్వ (సెంట్రల్ / స్టేట్ / పిఎస్‌యులు / కార్పొరేషన్‌లు / ఇతర ప్రభుత్వ రంగ) ఉద్యోగులు మాత్రం నిర్ణీత పరీక్ష రుసుమును చెల్లించవలసి ఉంటుంది.

ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విదానం

అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inని సందర్శించండి

'న్యూ రిజిస్ట్రేషన్ OTR'కి వెళ్లి నమోదును పూర్తి చేయండి

ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఖాళీల కోసం లాగిన్ చేసి దరఖాస్తు చేసుకోండి

దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, పత్రాలను అప్‌లోడ్ చేయండి, రుసుము చెల్లించండి

ఫారమ్‌ను సమర్పించి ప్రింటవుట్ తీసుకోండి

మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు ఇక్కడ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

WhatsApp channel

సంబంధిత కథనం