Spicy Coconut Rice Recipe : కొబ్బరి అన్నాన్ని స్పైసీగా, టేస్టీగా చేసేయండిలా..
Spicy Coconut Rice Recipe : కొబ్బరి అన్నం అనగానే మనకి గుర్తొచ్చేది స్వీట్. కానీ ఈ కొబ్బరి అన్నం స్పైసీగా ఉంటుంది. మరి ఈ స్పైసీ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Spicy Coconut Rice Recipe : తాజా కొబ్బరితో చాలా మంది కొబ్బరి అన్నం చేస్తారు. అయితే ఇప్పుడు మనం స్పైసీగా కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూజలకు ఉపయోగించిన కొబ్బరితో.. లేదా మధ్యహ్నాం వండిన అన్నం మిగిలిపోతే.. సాయంత్రం డిన్నర్ గానో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇది మీకు టేస్ట్ ఇవ్వడమే కాదు.. చేయడం కూడా చాలా ఈజీ. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* నూనె - 2 టేబుల్ స్పూన్లు
* వేరుశెనగ - 1/2 టేబుల్ స్పూన్
* ఆవాలు - 1 టీస్పూన్
* జీలకర్ర - 1 టీస్పూన్
* శనగ పప్పు - 1/2 టేబుల్ స్పూన్
* మినపప్పు - 1/2 టేబుల్ స్పూన్లు
* కరివేపాకు - 10
* ఎండు మిర్చి - 1
* పచ్చిమిర్చి - 1/2 కప్పు
* జీడిపప్పు - 1 కప్పు
* కొబ్బరి - 1 కప్పు (తురిమినది)
* బాస్మతి బియ్యం - 2 కప్పులు (వండినది)
తయారీ విధానం
ముందుగా పాన్ తీసుకుని.. దానిలో నూనె వేసి వేడిచేయాలి. దానిలో శనగపప్పు, పల్లీలు వేసి వేయించాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి బాగా కలిపి వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వాటిని బాగా వేయించాలి. తగినంత ఉప్పు వేసుకుని కలపాలి. ఇప్పుడు జీడిపప్పు వేసి.. వేయించాలి. తురిమిన కొబ్బరిని వేసి బాగా కలపాలి. కొబ్బరి ఫ్లేవర్.. ఇతర పదార్థాలకు పట్టే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దానిలో వండిన అన్నాన్ని పాన్‌లో వేసి.. బాగా కలపండి. అంతే టేస్టీ, స్పైసీ కొబ్బరి అన్నం రెడీ. వేడి వేడిగా వడ్డించుకుని లాగించేయండి.
సంబంధిత కథనం