Vegetable Millet Roti | బరువు తగ్గాలనుకునేవారు ఈ రోటీ కచ్చితంగా తినాల్సిందే..-today breakfast special is vegetable millet roti for weightloss recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vegetable Millet Roti | బరువు తగ్గాలనుకునేవారు ఈ రోటీ కచ్చితంగా తినాల్సిందే..

Vegetable Millet Roti | బరువు తగ్గాలనుకునేవారు ఈ రోటీ కచ్చితంగా తినాల్సిందే..

HT Telugu Desk HT Telugu
May 27, 2022 07:31 AM IST

హెల్తీగా ఉండాలని.. బరువు తగ్గాలని చాలామందికి ఉంటుంది. అలాంటివారు డైట్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. అయితే మీరు మీ డైట్​లో ఈ రోటీని కూడా యాడ్ చేసుకోవాలి అంటున్నారు ఆహార నిపుణులు. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడడమే కాకుండా.. రోగనిరోధకశక్తిని పెంచుతుంది అంటున్నారు. మరి ఆ రోటీ ఏంటి? తయారీ ఎలాగో తెలుసుకుందామా?

మిల్లెట్స్ రోటీ
మిల్లెట్స్ రోటీ

Vegetable Millet Roti | సాధారణంగా రోటీ అంటే గోధుమ పిండి, మైదాతో చేసుకుంటారు. కానీ ఈ రోటీలో ఎలాంటి గోధుమ, మైదా పిండి ఉండదు. బరువు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకునేవారు వీటికి దూరంగా ఉంటారు. అలాంటి వారికోసమే ఈ రోటీ. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా ఈ రోటీని మీ డైట్​లో యాడ్ చేసుకోవచ్చు. అయితే దీని తయారీ, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బంగాళదుంప - 1

* క్యారెట్ - 1(తురిమిన)

* ఉల్లిపాయ - 1(సన్నగా తరిగినవి)

* కరివేపాకు - 2 రెబ్బలు (తరిగిన)

* స్ప్రింగ్ ఆనియన్ - 2 టేబుల్ స్పూన్లు (తరిగిన)

* మిర్చి - 2 (సన్నగా తరిగినవి)

* జొన్న పిండి - కప్పు

* శెనగ పిండి - కప్పు

* రాగి పిండి - కప్పు

* నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు

* కసూరి మేతి - 1 టీస్పూన్

* జీలకర్ర - 1 టీస్పూన్

* ఉప్పు - తగినంత

* ¼పసుపు - చిటికెడు

* ¼ మిరియాల పొడి - స్పూన్

* ¼నీరు - సరిపడినన్ని

* ఆలివ్ నూనె - (వేయించడానికి)

తయారీ విధానం

బంగాళాదుంపపై తొక్క తీసి మెత్తగా తురుముకోవాలి. తురిమిన బంగాళాదుంపను శుభ్రమైన నీటిలో శుభ్రం చేయండి. బంగాళాదుంపను నీటి నుంచి తీసి.. నీరు పోయేలా పిండాలి. దానిని ఓ పెద్ద గిన్నెలో వేయాలి. అనంతరం.. క్యారెట్, ఉల్లిపాయలు, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, మిరపకాయలు వేయాలి. దానిలో జొన్న పిండి, శెనగ పిండి, రాగి పిండి కూడా వేయాలి. నువ్వులు, కసూరి మేతి, జీలకర్ర, ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి... బాగా కలపాలి. నీరు పోస్తూ.. పిండి మెత్తగా చేయాలి. అనంతరం పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి.

అనంతరం చేతిని తడి చేసుకుని.. బంతి-పరిమాణంలో పిండిని తీసుకోవాలి. దానిని వేడి చేసిన పెనం మీద ఉంచి.. చేతితో చపాతీలాగా ఒత్తాలి. కొద్దిగా నూనె వేసి.. మూతపెట్టి మీడియం మంట మీద ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత.. రెండో వైపు తిప్పాలి. మళ్లీ కాస్త నూనెను వేసి.. రెండు వైపులా కాల్చాలి. అంతే ఆరోగ్యకరమైన బరువు తగ్గించే రోటీ తయారైపోయింది. దీనిని రైతాతో తింటే చాలా బాగుంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్