Breakfast Recipes : అటుకులతో గారెలు.. టేస్ట్​ అద్భుతమనే చెప్పాలి..-today breakfast recipe is poha vada making and ingredients are here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipes : అటుకులతో గారెలు.. టేస్ట్​ అద్భుతమనే చెప్పాలి..

Breakfast Recipes : అటుకులతో గారెలు.. టేస్ట్​ అద్భుతమనే చెప్పాలి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 23, 2022 07:24 AM IST

బ్రేక్​ఫాస్ట్​లందూ గారె రుచి వేరనే చెప్పాలి. వీటికో సపరేట్ ఫ్యాన్ బేస్​ ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ వీటిని తయారు చేసుకోవడమే కాస్త ఎక్కువ పనితో కూడిన విషయం. కానీ పోహాతో ఈజీగా గారెలు వేసుకోవచ్చని మీకు తెలుసా? అయితే ఈ రెసిపీ మీకోసమే.

పోహా గారెలు
పోహా గారెలు

Poha Garelu Making : గారెలు చేయాలంటే ముందు మినపప్పు నానబెట్టాలి. తర్వాత ప్రాసెస్​ అంతా కాస్త ఎక్కువ పనితో కూడుకున్నది. అయితే గారెలు చేయడానికి మినపప్పు అవసరం లేదు పోహా చాలు అంటున్నారు చెఫ్​లు. రాత్రిపూట నానబెట్టిన పప్పుకు ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉంటుందని తెలిపారు. అయితే తక్కువ టైమ్​లో ఇష్టమైన గారెలను తయారు చేసుకుని లాగించేయాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పోహ - 1 కప్పు

* పెరుగు - 1 కప్పు

* పచ్చి మిరపకాయలు - 2 తరిగినవి

* కొత్తిమీర - 1 కట్ట (తరిగినవి)

* కరివేపాకు - 5, 6

* జీలకర్ర - చిటికెడు

* అల్లం - 1/2 తురిమినది

* ఉప్పు - తగినంత

* బియ్యం పిండి - 1 స్పూన్

* నూనె - డీప్​ ఫ్రైకి సరిపడ..

తయారీ విధానం

ఒక గిన్నెలో పోహా తీసుకుని దానిని బాగా కడగాలి. దానిలోని నీటిని మొత్తం తీసివేసి కాసేపు అలాగే ఉంచాలి. అనంతరం పోహాలో పెరుగు ముద్ద వేస్తూ.. మిక్సీ చేయండి. అది మెత్తని పిండిగా అయ్యేవరకు మరింత పెరుగువేస్తూ మిక్సీ చేయండి. పిండి కాస్త నీరుగా ఉంటే.. కొద్దిగా బియ్యం పొడి వేసి కలపండి.

ఇప్పుడు మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపండి. పిండి బాగా కలిశాక.. స్టవ్ వెలిగించి డీప్​ ఫ్రైకు సరిపడనూనె వేసి కాగనివ్వండి. నూనె కాగిన తర్వాత.. పోహా పిండిని మీడియం సైజ్​లలో గారెలుగా చేసుకుని.. వాటిని నూనెలో వేయండి. ఒక్కొక్కటిగా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వడను ఎక్కువసేపు ఉంచకుండా.. వేడి వేడిగా.. గ్రీన్ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో లాగించేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్