Breakfast Recipes : భల్లేగా అనిపించే మిల్లేట్స్ దోశ.. రెసిపీ మీకోసమే..-today breakfast recipe is millets dosa here is the ingredients and making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipes : భల్లేగా అనిపించే మిల్లేట్స్ దోశ.. రెసిపీ మీకోసమే..

Breakfast Recipes : భల్లేగా అనిపించే మిల్లేట్స్ దోశ.. రెసిపీ మీకోసమే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 25, 2022 07:12 AM IST

దోశలంటే అందరికీ ఇష్టముంటుంది. అయితే ఈదోశలను మరింత హెల్తీగా మార్చాలనుకుంటే మిల్లెట్స్ దోశను ట్రై చేయవచ్చు. దానిని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

<p>మిల్లెట్స్ దోశ తయారీ</p>
మిల్లెట్స్ దోశ తయారీ

Millets Dosa Recipe : మిల్లెట్ దోశ అనేది ఆరోగ్యకరమైనది. పైగా ఇది గ్లూటెన్ రహిత అల్పాహార వంటకం. మిల్లెట్స్ వాడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కానీ కొందరు వీటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ హెల్త్​ కోసం వాటిని తినకతప్పదు. అలాంటి వారు ఈ మిల్లెట్స్ దోశను తయారు చేసుకోవచ్చు. ఇది మీకు టేస్ట్​కి టేస్​నిస్తుంది. హెల్త్​కి కూడా చాలా మంచిది. పైగా దీనిని 20 నిమిషాలలోపు చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మంచి ఎంపిక. ఇంతటీ హెల్తీ దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* మిల్లెట్స్ - 1 కప్పు

* బియ్యం - అరకప్పు

* మినపప్పు - అరకప్పు

* ఉప్పు - తగినంత

* నూనె - తగినంత

తయారీ విధానం

మినపప్పును ఒక కంటైనర్‌లో నానబెట్టండి. బియ్యం, మిల్లెట్స్​ను మరో కంటైనర్​లో నానబెట్టండి. ఈ రెండు మిశ్రమాలు కనీసం 4 గంటలు నీటిలో నానాలి. తర్వాత ఈ మిశ్రమాలను గ్రైండ్ చేయండి.

మినపప్పు పిండిని.. మిల్లెట్స్ మిశ్రంతో బాగా కలపండి. దోశ కంటెస్టెన్సీ వచ్చే వరకు నీరు పోసి కలపుతూ ఉండండి. దానిలో తగినంత సాల్ట్ వేయండి. ఈ పిండిని 4-5 గంటలు లేదా రాత్రిపూట పులియనివ్వండి. అనంతరం వేడి చేసిన దోశ పాన్‌పై కొంచెం నూనె వేయండి. ఆపై కొంచెం నీరు చిలకరించి.. పిండితో దోశ వేయండి. అంతే వేడి వేడి హెల్తీ దోశలు రెడీ. దీనిని గ్రీన్ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో లాగిస్తే ఆహా అనేస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం