Tri Color Idli Recipe । త్రివర్ణ ఇడ్లీలు.. జెండా పండగ కోసం ప్రత్యేకమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ!
Independence Day 2023: స్వాతంత్య్ర దినోత్సవం భారతీయులందరూ జరుపుకునే పండుగ. ఈరోజు ప్రతీది ప్రత్యేకంగా జరుపుకుందాం,
Independence Day 2023: భారతదేశం ఈ సంవత్సరం 77వ స్వాతంత్య్ర దినోత్సవంను జరుపుకుంటోంది. ఈ స్వాతంత్య్రం ఎన్నో పోరాటాల ఫలితం, ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు స్వతంత్ర భారతావని కోసం సమిధలుగా మారారు. వారు తమ ఊపిర్లు వదిలి మనకు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న బ్రిటీష్ సంకెళ్లు తెగిపోయాయి, మువ్వన్నెల జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఒక శక్తిగా అవతరించింది, మూడు రంగుల జెండా శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. మనమందరం కూడా జెండా పండుగను ఘనంగా జరుపుకుందాం.
స్వాతంత్య్ర దినోత్సవం భారతీయులందరూ కలిసి జరుపుకునే జాతీయ పండుగ. ఈరోజు ప్రతీది ప్రత్యేకంగా జరుపుకుందాం, అందరితో కలిసి సంతోషంగా విందులు చేసుకుందాం. మనకు స్వాతంత్య్రం ప్రసాదించిన యోధులను స్మరించుకుందాం. మీకోసం ఇక్కడ త్రివర్ణ ఇడ్లీలు రెసిపీని అందిస్తున్నాం. మీరూ ఇలా ప్రయత్నించండి మరి.
Tri Color Idli Recipe కోసం కావలసినవి
- 1 కప్పు ఇడ్లీ రవ్వ/ దోశ పిండి
- 1 క్యారెట్
- 2 ఎర్ర మిరపకాయలు
- 1 కప్పు కొత్తిమీర
- 1 పచ్చిమిర్చి
- ఉప్పు రుచికి తగినంత
త్రివర్ణ ఇడ్లీ తయారు చేసే విధానం
- ముందుగా అవసరం మేరకు ఇడ్లీ పిండిని తీసుకుని మూడు సమాన భాగాలుగా విభజించండి. త్రివర్ణ ఇడ్లీలలో తెలుపు రంగు కోసం ఒక భాగాన్ని అలాగే ఉంచండి. మిగిలిన రెండు భాగాల పిండిని కాషాయ రంగు, ఆకుపచ్చ రంగు కోసం ఉపయోగించాలి.
- ఇప్పుడు కాషాయ లేదా నారింజ రంగు కోసం క్యారెట్ ముక్కలు లేదా టొమాటో మొక్కలను, ఎర్ర మిరపకాయలను ముక్కలుగా కోసుకొని రెండు నిమిషాల పాటు వేయించి మెత్తని ప్యూరీలాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న నారింజ రంగు ప్యూరీని ఇడ్లీ పిండిలో ఒక భాగానికి కలుపుకోండి.
- ఆకుపచ్చ రంగుకోసం, కొత్తిమీర లేదా పుదీనా లేదా పాలకూర మీకు నచ్చిన ఏదో ఒక ఆకుకూరను ఎంచుకోండి, మిరపకాయతో కలిపి మెత్తని ప్యూరీ లాగా రుబ్బుకోండి, దీనిని మరొక భాగం ఇడ్లీ పిండికి కలుపుకోండి.
- ఇలా వేర్వేరుగా మూడు రంగుల్లో సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీకుక్కర్లో ఒక్కో పాత్రలో ఒక్కో రంగు పిండివేసి ఆవిరి మీద ఉడికించాలి.
అంతే, మూడు రంగుల త్రివర్ణ ఇడ్లీలు రెడీ. సర్వింగ్ ప్లేట్ లో మూడు రంగుల ఇడ్లీలను వరుస క్రమంలో పేర్చండి. టొమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీలతో సర్వ్ చేసుకోండి.
సంబంధిత కథనం