Spicy Coconut Rice Recipe : స్పైసీ స్పైసీ కొబ్బరి అన్నం.. లంచ్‌కి, డిన్నర్‌కి పర్ఫెక్ట్ ఇది..
Spicy Coconut Rice Recipe : సాధారణంగా కొబ్బరి అన్నంటే స్వీట్లా చేసుకుంటాము. కానీ స్పైసీ కొకొనెట్ రైస్ తిన్నారా? దీనిని మీకు నచ్చిన కర్రీతో ఆస్వాదించేలా తయారు చేసుకోవచ్చు. మరి ఈ స్పైసీ కొబ్బరి అన్నాన్ని ఎలా వండుకోవచ్చో.. కావాల్సి పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Spicy Coconut Rice Recipe : మీరు రొటీన్ రైస్‌కి బాయ్ చెప్పాలనుకుంటే కొబ్బరి అన్నం ట్రై చేయవచ్చు. ఈ రుచికరమైన డిష్‌ను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. పైగా దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ టేస్టీ, సింపుల్ రైస్‌ను ఎలా తయారుచేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* బియ్యం - 500 గ్రాములు
* నూనె - తగినంత
* ఆవాలు - 5 గ్రామములు
* జీలకర్ర - 5 గ్రాములు
* మినపప్పు - 10 గ్రాములు
* జీడిపప్పు - 50 గ్రాములు
* కరివేపాకు - 1 రెబ్బ
* పచ్చిమిర్చి - 10 గ్రాములు
* కొబ్బరి - 100 గ్రాములు కొబ్బరి (తురిమినది)
* కొబ్బరి పాలు - 100 మి.లీ
* నిమ్మరసం - 10 ml
* ఉప్పు - రుచికి తగినంత
కొబ్బరి అన్నం తయారీ విధానం
ఇప్పుడు ఓ పాన్ తీసుకుని దానిలో నూనె వేసి వేడి చేయండి. దానిలో ఆవాలు వేసి.. అవి చిటపటలాడేటప్పుడు.. జీలకర్ర వేయండి. అనంతరం మినపప్పు వేసి.. అవి బంగారు రంగులోకి వచ్చాక.. జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. దానిలో కరివేపాకు, కొబ్బరి వేసి వేయించండి.
ఇప్పుడు ఈ తాలింపును కుక్కర్లో వేసి.. కొబ్బరిపాలు, బియ్యం, తగినన్నీ నీళ్లు, ఉప్పు, నిమ్మరసం వేసి ఉడికించండి. అంతే స్పైసీ కొబ్బరి అన్నం రెడీ. దీనిని మీకు నచ్చిన కర్రీతో ఆస్వాదించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్