Red Flags in Relationships : లివ్​ ఇన్ రిలేషనే కాదు.. ఏ బంధంలోనైనా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే జాగ్రత్త పడండి..-shraddha walker murder case puts spotlight on toxic relationships here is the red flags women s should watch out ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Red Flags In Relationships : లివ్​ ఇన్ రిలేషనే కాదు.. ఏ బంధంలోనైనా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే జాగ్రత్త పడండి..

Red Flags in Relationships : లివ్​ ఇన్ రిలేషనే కాదు.. ఏ బంధంలోనైనా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే జాగ్రత్త పడండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 18, 2022 09:47 AM IST

Red Flags in Relationships : దేశం అంతా సంచలనం రేపింది శ్రద్ధా వాకర్ హత్య. ఓ టాక్సిక్ రిలేషన్​లోనే ఉంటూ.. రెడ్ ఫ్లాగ్స్​ గుర్తించకుండా.. చివరికి తన భాగస్వామి చేతిలోనే హతమైపోయింది. కనీసం ఈ ఇన్స్​డెంట్ తర్వాత అయిన అమ్మాయిలు టాక్సిక్​ రిలేషన్స్​నుంచి బయటకు వస్తే.. వారికే మంచిది. టాక్సిక్ రిలేషన్​లోని రెడ్​ ఫ్లాగ్స్​ని ఎలా గుర్తించాలంటే..

టాక్సిక్ రిలేషన్​లోని రెడ్​ ఫ్లాగ్స్
టాక్సిక్ రిలేషన్​లోని రెడ్​ ఫ్లాగ్స్

Red Flags in Relationships : లివ్​ ఇన్ రిలేషన్ షిప్. ఈ కాలంలో ఇది తెలియని వాళ్లు ఎవరూ లేరు. కనీసం అవగాహనైనా ఉంటుంది. పెళ్లికాకుండానే ఇద్దరూ అంగీకరిస్తూ.. ఒకే ఇంట్లో ఉంటూ.. లైఫ్​ని షేర్ చేసుకోవడమే లివ్​ ఇన్ రిలేషన్ షిప్. ఈ బంధంలో ఏ ఒక్కరికి నచ్చకపోయినా.. మరొకరు ప్రశ్నించే రైట్ ఉండదు. వీటి గురించి చర్చించుకున్నాకే ఈ సంబంధంలోకి వెళ్తున్నారు.

ఈ రిలేషన్​లో ఏది నచ్చకపోయినా వెళ్లిపోయే అవకాశముంది. శ్రద్ధకు కూడా ఈ విషయం తెలుసు. అయినా కూడా ఆమె ఆఫ్తాబ్​తోనే కలిసి ఉంది. అలా చేయడమే ఆమె తప్పు అయిపోయింది. చివరికి నిందితుడి చేతిలో 35 ముక్కలైపోయింది. కనీసం ఈ సంఘటన చూసైనా అమ్మాయిలు తమ భద్రత విషయం గురించి ఆలోచించాలి. కలిసి ఉంటేనే కదా ఈ సమస్య వచ్చేది అనుకుంటే పొరపాటే. మీరు విడిగా ఉంటున్నా కూడా కొన్ని విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

ఎలాంటి రిలేషన్ అయినా వదిలి వెళ్లిపోయే అవకాశముంటుంది. కొన్నిసార్లు ఆలస్యం కావొచ్చు కానీ.. వెళ్లాలి అనుకుంటే మీరు కచ్చితంగా వెళ్లిపోండి. ముఖ్యంగా మీరు టాక్సిక్ రిలేషన్​లో ఉంటే ఎంత త్వరగా వీలైత్ అంత త్వరగా బయటపడండి. ఒకవేళ ఇప్పుడు మీరు లివ్​ ఇన్ రిలేషన్ షిప్​లోకి వెళ్లాలని ఆలోచిస్తుంటే.. మీరు కచ్చితంగా అన్ని ఆలోచించుకుని.. హ్యాండిల్ చేయగలరు అనిపిస్తేనే వెళ్లండి. అంతే కాకుండా మీ సంబంధంలోని రెడ్​ ఫ్లాగ్స్​ని గుర్తించండి.

రెస్పెక్ట్ లేకుంటే..

వ్యంగ్యంగా లేదా విమర్శలతో వ్యాఖ్యలు చేసినప్పుడు, ఒకరి పట్ల మరొకరు గౌరవంతో కాకుండా.. అగౌరవంతో ఉంటున్నప్పుడు.. నలుగురిలో మిమ్మల్ని కించపరుస్తూ.. అవమానిస్తుంటే.. మీరు వాటిని లైట్ తీసుకోకూడదు. అవే మీ రిలేషన్​లో రెడ్ ఫ్లాగ్స్ అని గుర్తించాలి.

అసూయ

అసూయ, జెలస్ అనేవి సంబంధంలో విస్మరించకూడని మరో ప్రతికూల లక్షణం. అలాంటి భావాలు ఒక వ్యక్తికి పూర్తిగా సాధారణమైనప్పటికీ.. అవి కొనసాగే కొద్ది అనుమానం, అపనమ్మకానికి దారితీస్తాయి. అవి త్వరగా మీ సంబంధాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి.

ఆర్థిక నిర్ణయాల విషయంలో

భాగస్వామితో ఆర్థిక నిర్ణయాలను పంచుకునేటప్పుడు కొన్ని స్థాయిల ఒప్పందాన్ని చేరుకోవడం సర్వసాధారణం. అయితే మీ భాగస్వామి.. మీకు నచ్చని, అంగీకరించని విషయాలపై డబ్బు ఖర్చు చేయాలని నిర్ణయించుకుంటే అది టాక్సిక్ కాదు. కానీ మీ డబ్బులతో మీకు నచ్చని విషయాలు తరచూగా చేస్తుంటే.. వారు మిమ్మల్ని వాడుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఖరీదైన కొనుగోళ్లు చేయడం లేదా పెద్ద మొత్తంలో నగదు కొంటున్నారంటే.. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని అర్థం.

స్థిరమైన ఆందోళన

ఎటువంటి ఒత్తిడి కారకాలు లేనప్పటికీ.. అన్ని సమయాలలో ఆందళన పడుతున్నారంటే.. అది మీ సంబంధానికి ఓ రెడ్ అలెర్ట్. ఈ ఒత్తిడి కారణంగా మీ శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అనారోగ్యం బారిన పడవచ్చు. కాబట్టి మీ భాగస్వామి స్ట్రెస్​లో ఉంటే అర్థం చేసుకుని వారికి స్పేస్ ఇవ్వండి లేదా వారి ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నించండి. లేకుంటే మీ బంధం కచ్చితంగా వీక్ అయిపోతుంది.

మార్పు వస్తుందని ఎదురు చూస్తూ..

ప్రస్తుతం కాలంలో చాలా మంది టాక్సిక్ రిలేషన్స్​లోనే ఎక్కువగా ఉంటున్నారు. అవతలి వ్యక్తి తమ ప్రవర్తనను మార్చుకుంటారులే అని నమ్మి.. వారితో బలవంతగా ఉంటున్నారు. వారు కలిసి గడిపిన "సంతోషకరమైన జ్ఞాపకాలు" తలచుకుంటూ.. మళ్లీ ఆ రోజులు వస్తాయని వారి దగ్గరే ఉండిపోతున్నారు. ఛాన్స్ ఇవ్వండి తప్పుకాదు. కానీ.. అది కంటిన్యూగా ఇస్తున్నారంటే.. కచ్చితంగా తప్పు మీదే అవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్