SEBI Recruitment 2022:సెబీలో ఉద్యోగాలు.. నెలాఖరు వరకే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా-sebi grade a recruitment 2022 sebi register for 24 posts till july 31 apply here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sebi Recruitment 2022:సెబీలో ఉద్యోగాలు.. నెలాఖరు వరకే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా

SEBI Recruitment 2022:సెబీలో ఉద్యోగాలు.. నెలాఖరు వరకే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా

HT Telugu Desk HT Telugu
Apr 06, 2023 11:15 AM IST

SEBI Grade A Recruitment 2022: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ( SEBI ) ఆఫీసర్ గ్రేడ్ A ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు గడవు దగ్గరపడుతుంది. జూలై 31, 2022న దరఖాస్తు ప్రక్రియను ముగియనుంది.

<p>SEBI Recruitment 2022</p>
<p>SEBI Recruitment 2022</p>

SEBI Grade A Recruitment 2022: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ( SEBI ) ఆఫీసర్ గ్రేడ్ A (Assistant Manager) - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను జూలై 31, 2022న ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్‌సైట్ sebi.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తు ప్రక్రియ జూలై 14, 2022న ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 24 ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం, క్రింద చూడండి.

ముఖ్యమైన తేదీలు

SEBI రిక్రూట్‌మెంట్ 2022 రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 14, 2022

SEBI రిక్రూట్‌మెంట్ 2022 రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ: జూలై 31, 2022

SEBI వెబ్‌సైట్‌లో కాల్ లెటర్‌ల జారీ (ఆన్‌లైన్ పరీక్షల కోసం): ఈ మెయిల్/SMS ద్వారా తెలియజేయబడుతుంది

ఫేజ్ I ఆన్‌లైన్ పరీక్ష, ఫేజ్ II పరీక్ష పేపర్ 1: ఆగస్టు 27, 2022

ఫేజ్ II పరీక్ష పేపర్ 2: సెప్టెంబర్ 24, 2022

ఫేజ్ III ఇంటర్వ్యూ: తేదీలు త్వరలో తెలియజేయబడతాయి.

ఖాళీల వివరాలు

ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్: 24 పోస్టులు

వేతనం : గ్రేడ్ Aలోని అధికారుల పే స్కేల్ 44500-2500(4)-54500-2850(7)-74450-EB-2850(4)-85850-3300(1)-89150 (17 సంవత్సరాలు)

అర్హతలు: ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ అప్లికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ (కనీసం 2 సంవత్సరాల వ్యవధి) అర్హత కలిగి ఉండాలి. అలాగే ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. మరిన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేయండి.

ఎంపిక విధానం: ఎంపిక విధానం మూడు-దశలుగా ఉంటుంది, మెుదటి దశలో (ఒక్కొక్కటి 100 మార్కుల రెండు పేపర్‌లతో కూడిన ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష), రెండో దశలో (ఒక్కొక్కటి 100 మార్కుల రెండు పేపర్‌లతో కూడిన ఆన్‌లైన్ పరీక్ష), ఫేజ్ III (ఇంటర్వ్యూ).

దరఖాస్తు రుసుము

అన్‌రిజర్వ్‌డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము కమ్ ఇంటిమేషన్ ఛార్జీలుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.SC/ ST/ PwBD వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 100 ఇంటిమేషన్ ఛార్జీలుగా చెల్లించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఆన్‌‌లైన్లో ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం నేరుగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు SEBI యొక్క అధికారిక వెబ్‌సైట్ sebi.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం, SEBI అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి.

టాపిక్