LIC IPO:ఎల్‌ఐసీ షేర్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఇలా ఈజీగా కొనేయండి!
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జీవిత బీమా సంస్థ (LIC) జారీ చేసిన IPOకు ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తో్ంది. ఈ నేపథ్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు YONO యాప్ ద్వారా LIC IPO కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
దేశంలోని అతిపెద్ద భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) మే 4 2022న IPOను ప్రారంభించిన విషయం తెలిసిందే. మే 9 వరకు ఈ షేర్ల సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది.ఇక అరభంలోనే LIC IPO అదరగొట్టింది, తొలి రోజే నుండే ఈ ఐపీఓకి ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పటికీ వరకు దేశ చరిత్రలో నమోదైన IPOలో ఇదే అతి పెద్దదిగా చెప్పవచ్చు. ఎవరికైతే డీమాట్ అకౌంట్ ఉంటుందో వారు LIC షేర్లను ఈజీగా కొనగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల ఆసక్తిని గమనించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను డీమ్యాట్ ఖాతాను ఓపెన్ చేయడానికి LIC IPOలో పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇస్తోంది.
దీని కోసం SBI తన యోనో యాప్‌లో పూర్తిగా అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఇక SBI YONO మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా లావాదేవీలు మాత్రమే కాకుండా డీమ్యాట్ ఖాతాను కూడా తెరవవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు YONO యాప్ ద్వారా IPO కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ ఎల్‌ఐసి ఐపిఓలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఎస్‌బిఐ యోనో ద్వారా పెట్టుబడి పెట్టడానికి ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం
SBI YONO యాప్ ద్వారా LIC IPOలో పెట్టుబడి పెట్టే విధానం
Step 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో SBI యోనో యాప్‌ని ఓపెన్ చేయండి
Step 2: మీ బ్యాంక్ వివరాల ద్వారా YONO SBI యాప్‌కి లాగిన్ చేయండి.
Step 3: మెయిన్ మెనూకి వెళ్లి, పెట్టుబడి విభాగానికి వెళ్లండి.
Step 4: ఓపెన్ డీమ్యాట్ మరియు ట్రేడింగ్ ఖాతాపై క్లిక్ చేయండి.
Step 5: అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి.
Step 6: 'Confirm'పై క్లిక్ చేయండి.
డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాను తెరిచిన తర్వాత, మీరు చాలా సులభంగా LIC IPOలో పెట్టుబడి పెట్టవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్