Sunscreen tips: సన్‌స్క్రీన్ స్టిక్ బెటరా? రెగ్యులర్ సన్‌స్క్రీన్ బెటరా?-regular sunscreen or sunscreen sticks which offers superior skin protection ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunscreen Tips: సన్‌స్క్రీన్ స్టిక్ బెటరా? రెగ్యులర్ సన్‌స్క్రీన్ బెటరా?

Sunscreen tips: సన్‌స్క్రీన్ స్టిక్ బెటరా? రెగ్యులర్ సన్‌స్క్రీన్ బెటరా?

Akanksha Agnihotri HT Telugu
Jul 14, 2023 08:00 AM IST

Sunscreen tips:సన్ స్క్రీన్ వాడకం ప్రతిరోజూ తప్పనిసరి. అయితే అందులో ఉండే రకాల్లో ఏది వాడాలో అనే సందేహం ఉంటుంది. రెగ్యులర్ సన్‌స్క్రీన్ బెటరా? లేదా సన్‌స్క్రీన్ స్టిక్ బెటరా అనేది తెలుసుకోండి.

సన్‌స్క్రీన్ స్టిక్ Vs రెగ్యులర్ సన్‌స్క్రీన్
సన్‌స్క్రీన్ స్టిక్ Vs రెగ్యులర్ సన్‌స్క్రీన్ (Pexels )

చర్మాన్ని హానికరమైన కిరణాల నుంచి సన్‌స్క్రీన్ రక్షిస్తుంది. కాలంతో, రోజుతో సంబంధం లేకుండా ప్రతి రోజూ సన్‌స్క్రీన్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సన్‌స్క్రీన్ చాలా రకాలుగా అందుబాటులో ఉంటుంది. దాంట్లో ఏది వాడితే ఉత్తమమో అనే విషయం మీద సందేహాలూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఈ మధ్య వింటున్న సన్‌స్క్రీన్ స్టిక్స్ బెటరా లేదా రెగ్యులర్ సన్‌స్క్రీన్ మంచిదా అనే విషయాన్ని లోతుగా తెలుసుకుందాం.

రెగ్యులర్ సన్‌స్క్రీన్:

ఇది మామూలుగా క్రీం లేదా లోషన్ లాగా దొరుకుతుంది. చాలా మంది వాడేది కూడా ఇదే. దీనికున్న లాభాలే దీన్నంతలా వాడేలా చేశాయి. అవేంటో చూద్దాం.

  1. కవరేజీ, అప్లికేషన్: ఈ సన్‌స్క్రీన్ బ్రాడ్ కవరేజీ ఇస్తాయి. చర్మం మొత్తం సమంగా అంటుకుని చర్మాన్ని కాపాడతాయి. అలాగే ఇవి క్రీం లేదా లోషన్ లాగా ఉంటాయి కాబట్టి సులువుగా ముఖానికి, చేతులకు.. ఇంకెక్కడయినా రాసుకోవడం చాలా సులభం.
  2. ఎస్‌పీఎఫ్: రెగ్యులర్ సన్‌స్క్రీన్ వివిధ రకాల ఎస్‌పీఎఫ్ స్థాయుల్లో దొరుకుతుంది. మనం బయట తిరిగే సమయం, చర్మం రకం బట్టి వీటిని ఎంచుకోవచ్చు. వీటివల్ల కిరణాల నుంచి రక్షణ దొరకడమే కాక మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తాయి. కొన్నింట్లో యాంటీ ఆక్సిడెంట్లు, చర్మానికి మేలు చేసే పదార్థాలుంటాయి.
  3. వాడటానికి వీలుగా: ఇవి పలుచగా ఉండి చర్మంలోకి తొందరగా ఇంకిపోతాయి. అలాగే చర్మం మీద ఎలాంటి తెల్లటి అవశేషం మిగల్చవు. అందుకే రోజుమొత్తం కూడా వీటిని రాసుకోవడం చాలా సులభం.
  4. పలుమార్లు వాడాలి: రెగ్యులర్ సన్‌స్క్రీన్ కనీసం రెండు గంటలకోసారి రాసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఎక్కువగా చెమట వచ్చేవాళ్లు, లేదా నీళ్లలో ఉండాల్సి వచ్చినప్పుడు సన్‌స్క్రీన్ రాస్తూ ఉండాల్సిందే. ఇది లోషన్ రూపంలో ఉండటం వల్ల అలా పలుమార్లు రాసుకోవడం కూడా తేలికే అనిపిస్తుంది.

సన్‌స్క్రీన్ స్టిక్:

సన్‌స్క్రీన్ స్టిక్స్ ఈ మధ్యే మార్కెట్లోకి వచ్చాయి. వీటివల్ల కూడా భిన్న ప్రయోజనాలున్నాయి.

  1. సౌకర్యం: ఇవి చిన్నగా, తక్కువ బరువులో ఉంటాయి. లీకేజీ సమస్య ఉండదు. ప్రయాణాల్లో వాడటానికి చాలా సౌకర్యంగా ఉంటాయి. చిన్న పాకెట్లో, బ్యాగుల్లో, పర్సుల్లు సులువుగా అమరిపోతాయి.
  2. రాసుకోవడం తేలిక: ఇవి స్టిక్ రూపంలో ఉండటం వల్ల అనుకున్న చోట ఖచ్చితంగా రాసుకోవచ్చు. ముక్కు, చెవులు, పెదాల చుట్టూ సులభంగా రాసుకోవచ్చు. చేయి వాడకుండా నేరుగా రాసుకోవచ్చు. ఎలాంటి గందరగోళం ఉండదు.
  3. నీటిని తట్టుకుంటాయి: చాలా మట్టుకు అన్ని సన్‌స్క్రీన్ స్టిక్స్ వాటర్ రెసిస్టెంట్ గుణాలు కలిగిఉంటాయి. అందుకే నీళ్లలో తడిసినా.. స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్ ఆడినా ఎలాంటి సమస్య ఉండదు.
  4. జిడ్డు ఉండదు: ఇవి జిడ్డుగా ఉండవు. సన్‌స్క్రీన్ రాసుకున్నాక చర్మం అస్సలే జిడ్డుగా అనిపించదు. అందుకే ముఖ్యంగా జిడ్డు, యాక్నె సమస్య చర్మం రకం ఉన్నవాళ్లు దీన్ని వాడొచ్చు. చర్మ రంధ్రాలు మూసుకుపోయి ఇతర సమస్యలొస్తాయనే భయం కూడా అక్కర్లేదు.

రెగ్యులర్ సన్‌స్క్రీన్ బెటరా? స్టిక్ బెటరా?

రెండింటికీ భిన్న ప్రయోజనాలున్నాయి. సరైన పద్దతిలో వాడితే రెండూ హానికర యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. అయితే మీ అవసరానికి తగ్గట్లు కొన్ని విషయాలు గుర్తుంచుకుని వీటిని ఎంచుకోవచ్చు.

  1. ఎస్‌పీఎఫ్
  2. రాసుకునే వీలు
  3. పలుమార్లు రాసుకునే విషయంలో సౌకర్యం

మీ వ్యక్తిగత అవసరం, ఇష్టం ప్రకారం వీటిని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీరు ప్రయాణాలు ఎక్కువగా చేసేవాళ్లయితే మీకు స్టిక్ రకంవి సరైన ఎంపిక. అలాగే మీకు కావాల్సిన ఎస్‌పీఎఫ్ రకాన్ని బట్టి ఏది వీలుంటే దాన్ని ఎంచుకోవచ్చు. అలాగే మీ చర్మం రకం బట్టి ఎంచుకోవడం మర్చిపోవద్దు.

Whats_app_banner