Protein-rich Breakfast Recipes । ప్రోటీన్లతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ చేయాలా? ఈ రెసిపీలు చూడండి!
Protein-rich Breakfast Recipes: బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజులో తినే ముఖ్యమైన భోజనం కాబట్టి మంచి పోషక విలువలు కలిగిన అల్పాహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. ఇక్కడ అలాంటి రెండు రెసిపీలు చూడండి.
Protein-rich Breakfast Recipes: ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి అని ప్రతిరోజూ ఆలోచిస్తున్నారా? అయితే న్యూట్రిషనిస్టులు మాత్రం బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజులో తినే ముఖ్యమైన భోజనం కాబట్టి మంచి పోషక విలువలు కలిగిన అల్పాహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. ఎలాంటి అల్పాహారాలు తీసుకోవచ్చో కొన్ని సూచనలు చేశారు. ఇందులో భాగంగా గుడ్లతో చేసిన టోస్ట్, ప్రోటీన్లు నిండిన దోశ, కూరగాయలతో చేసిన పరోటాలు వంటివి తీసుకోవాలి. వాటితో పాటు పండ్లు, హెర్బల్ టీలు లేదా వెజిటెబుల్ జ్యూస్‌లు తాగాలని చెబుతున్నారు. ఇక్కడ అలాంటి రెండు రెసిపీలు చూడండి.
గుడ్డుతో పాటుగా టోస్ట్ తినడం ఒక మంచి అల్పాహారం. ఈ రెసిపీని సులభంగా చేసుకోవచ్చు. ఇలాంటి అల్పాహారం తినడం ద్వారా శరీరానికి ప్రోటీన్, మంచి కొవ్వులు, ఇనుము అందుతాయి.
Egg on Toast Recipe కోసం కావలసినవి
- 2 గుడ్లు
- 2 బ్రెడ్ ముక్కలు
- 1 టేబుల్ స్పూన్ మాయో సాస్
- 1 చిటికెడు మిరియాల పొడి చిటికెడు
- 1 టీస్పూన్ వెన్న
- రుచికి తగినంత ఉప్పు, కారం
ఎగ్ టోస్ట్ తయారీ విధానం:
- ముందుగా ఒక గిన్నెల్లో నీటిని మరిగించి, అందులో నెమ్మడిగా గుడ్లను జార విడవండి. సరిగ్గా ఆరు నిమిషాలు ఉడికించాలి.
- మరోవైపు బ్రెడ్‌కి కొద్దిగా వెన్నపూసి, పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి.
- ఆపై ఈ బ్రెడ్ టోస్టుపై మయో క్రీమ్ లేదా మీకు నచ్చిన స్ప్రెడ్‌ను పూయండి. ఆపై ఉడికించుకున్న గుడ్లను ముక్కలుగా చేసి టోస్టుపై పరచండి.
- పైనుంచి చిటికెడు మిరియాలపోడి, కారం, ఉప్పు చల్లుకొని మరో బ్రెడ్ టోస్టుతో కప్పి వేయండి.
- అంతే రుచికరమైన ఎగ్ టోస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ.
ప్రోటీన్ దోశ
కొన్ని కాయధాన్యాలు, పప్పులను కలిపి దోశ చేసుకోవచ్చు. ఇది ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే అల్పాహారం. ప్రోటీన్ దోశ చేయాలంటే కాయధాన్యాలు, పప్పులు నానబెట్టి, ఆ తర్వాత వాటిని గ్రైండ్ చేసి, పిండి రుబ్బుకొని చేయాల్సి ఉంటుంది. లేదా నేరుగా వివిధ పిండ్లను ఉపయోగించి ఇన్‌స్టంట్ ప్రోటీన్ దోశ చేసుకోవచ్చు, ఆ రెసిపీ ఇక్కడ చూడండి.
Protein Dosa Recipe కోసం కావలసినవి
- 1/4 కప్పు శనగపిండి
- 1/2 కప్పు గోధుమ పిండి
- 1/2 కప్పు బియ్యం పిండి
- 1 ఉల్లిపాయ
- 1/2 చెంచా జీలకర్ర
- 1/4 చెంచా ఇంగువ
- 1/2 స్పూన్ కారం
- 1/4 చెంచా పసుపు
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- తగినంత ఉప్పు
- తాజా కొత్తిమీర
తయారీ విధానం
- ఒక గిన్నెలో గోధుమ పిండి, బియ్యప్పిండి, శనగపిండి వేసి కలపాలి.
- అందులో తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఇంగువ, కారం, పసుపు, ఉప్పు వేసి కలపండి
- ఆపైన అవసరం మేరకు నీరు కలపండి, దోశలు వేసుకునేలా చిక్కటి పిండిని సిద్ధం చేయండి.
- ఇప్పుడు పాన్ వేడి చేసి, నూనె చిలకరించి దోశ వేయండి.
- గోధుమ రంగులో వచ్చే వరకు దోశను కాల్చండి. దోశను రెండు వైపులా కాల్చుకోండి. అంతే, ప్రోటీన్ దోశ రెడీ.
ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా చేయాలి. అయితే ఏదో ఒకటి కాకుండా పోషకాలు నిండిన అల్పాహారం అయి ఉండాలి. దీంతో మధ్యాహ్నం వరకు ఎనర్జీగా ఉంటారు, జీవక్రియ రేటు బాగుంటుంది.
సంబంధిత కథనం