Propose day 2024: ఇలా అందంగా ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, కొన్ని ప్రపోజల్ మెసేజులు ఇవిగో-propose day 2024 if you propose beautifully then propose here are some proposal messages ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Propose Day 2024: ఇలా అందంగా ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, కొన్ని ప్రపోజల్ మెసేజులు ఇవిగో

Propose day 2024: ఇలా అందంగా ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, కొన్ని ప్రపోజల్ మెసేజులు ఇవిగో

Haritha Chappa HT Telugu
Feb 08, 2024 07:00 AM IST

Propose day 2024: ప్రపోజ్ చేస్తే మనసు కరిగిపోవాలి. అలా అందమైన పదాలతో ప్రపోజ్ చేస్తే ఎవరైనా మీ ప్రేమలో పడిపోవాల్సిందే. ఇక్కడ మేం కొన్ని అందమైన ప్రపోజల్ మెసేజులు ఇచ్చాం. వీటిలో మీ భావోద్వేగాలన్నీ మిళితమై ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినది ఎంచుకుని మీ ప్రేయసికి పంపండి.

ప్రపోజ్ డే
ప్రపోజ్ డే (Pixabay)

వాలెంటైన్స్ వీక్ మొదలైపోయింది. ప్రేమ పక్షులకు పండగే. వాలెంటైన్ వీక్ రోజ్ డే తో మొదలవుతుంది. ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే. వారమంతా ప్రేమికులు ఒకరినొకరు ప్రేమ వ్యక్తపరుచుకునేందుకు సిద్ధమవుతారు. రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్న జంటలకు ముఖ్యమైన రోజు ప్రపోజ్ డే. ఈ రోజున తమకు ఇష్టమైన వారికి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. కొంతమంది ధైర్యంగా వారికి ముందుకు వెళ్లి తమ ప్రేమను అధికారికంగా ప్రకటిస్తారు. మరికొందరికి మాత్రం అలా ఎదురెళ్లి చెప్పే ధైర్యం ఉండదు. అలాంటి వారు మెసేజులు, స్టేటస్‌ల తమ ప్రేమలను తెలియజేస్తారు. ఆ మెజేజుల్లోనే మీ ప్రేమ మొత్తం నిండిపోవాలి. మీ భావోద్వేగాలు ఇంకిపోవాలి. అలాంటి మెసేజులు ఇక్కడ కొన్ని ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని ఎంచుకుని మీ ప్రియమైన వారికి పంపండి. మీ భాగస్వామి హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయే ఉత్తమ ప్రపోజల్ మెసేజులు ఎన్నో ఉన్నాయి.

ప్రపోజ్ డే 2024 కోసం అందమైన మెసేజులు, కోట్స్

  1. నువ్వు నా జీవితంలో సూర్యకాంతివి. నన్ను ఓదార్చే వెన్నెలవి. ఇంతకు ముందెన్నడూ నేను ఇలాంటి అనుభూతిని చెందలేదు. ఇంత గాఢమైన ప్రేమలో పడతానని అనుకోలేదు. నా జీవితంలో ఎప్పటికీ నువ్వుండాలని కోరుకుంటున్నాను.

2. నా జీవితంలో ఉన్న చీకటిలో కనిపించిన వెలుగువు నువ్వు. నిన్ను మించిన విలువైనది నా జీవితంలో ఏదీ లేదు. మనసులోతుల్లో నిన్ను ఆరాధిస్తున్నాను. నువ్వే నా ప్రపంచం. ఐ లవ్ యూ

3. ఈ కపట ప్రపంచంలో, నాకు ఖచ్చితంగా తెలిసిన నిజమైన విషయం ఏమిటంటే, నీపై నాకున్న ప్రేమ. నా జీవితంలో నిన్ను భాగస్వామిగా పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నీ వల్ల నా జీవితం ప్రకాశవంతంగా మారడం ఖాయం.

4. నిన్ను కలిసిన క్షణం నుంచీ నా హృదయం నిండిపోయింది. ఈ రోజు నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను… నువ్వు నాతో జీవితాంతం కలిషి ఉంటావా? మనిద్ధరం కలిసి మరిన్ని జ్ఞాపకాలను నిర్మించుకుందామా?

5. నీతో ఉన్నప్పుడే సంతోషానికి నిజమైన అర్థాన్ని కనిపెట్టాను. మనిద్దరం కలిసి మన అందమైన కథను రాసుకుందాం. నువ్వు ఎప్పటికీ నాతో ఉండిపోతావా?

6. ప్రతి ప్రేమకథ అందంగా ఉంటుంది, కానీ మనది నా ఫేవరెట్. కలిసి మరిన్ని అధ్యాయాలు రాద్దాం. … అదీ నువ్వు అవునంటే.

7. నీ కళ్ళలో… నా ప్రేమ, నా భవిష్యత్తును చూసుకున్నాను. నీతో పాటూ జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను సృష్టించాలనుంది. నువ్వు నా జీవిత భాగస్వామి అవుతావా?

8. నువ్వే నా సోల్ మేట్, నా స్నేహితుడు, నా సపోర్ట్. అందుకే నిన్ను నా జీవితభాగస్వామిగా ఆహ్వానించాలని కోరుకుంటున్నా. ఆ గౌరవప్రదమైన పదవిని నాకు ఇస్తావా?

9. నువ్వు నా హృదయాన్ని దోచుకున్నావు. దాన్ని మళ్లీ నాకు తిరిగి ఇవ్వద్దు. నీదగ్గరే జీవితాంతం ఉంచేయాలనుకుంది. నన్ను పెళ్లి చేసుకుని… నా గుండెను నీ దగ్గర ఉంచేసుకో.

10. ప్రేమ, ఓర్పు, దయాగుణం… ఇవన్నీ నేను నీలో చూశాను. నీతో నేనుంటే సంతోషంగా ఉంటానన్న నమ్మకం నాకు ఉంది. నీ పక్కన నీ లైఫ్ పార్టనర్ గా నిల్చునే అవకాశాన్నినాకు ఇవ్వు. జీవితాంతం కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటా.

11. ప్రేమ గుడ్డిదని అంటారు, కానీ నీ వల్ల నాకు ప్రేమంటే ప్రకాశవంతమైన నక్షత్రాలతో నిండిన విశాల ఆకాశమని తెలిసింది. నువ్వు ఎప్పటికీ నా పక్కనే నిలుస్తావా?

12. దిక్సూచి ఉత్తరం దిక్కును చూపినట్లుగా, నా హృదయం మిమ్మల్ని చూపిస్తుంది. మా జీవితాలను కలిసి నావిగేట్ చేయడానికి నాకు అవకాశం కల్పిస్తారా?

13. జీవితం ఒక పజిల్, నేను వెతుకుతున్న మిస్సింగ్ పీస్ నువ్వే. నా జీవితాన్ని పూర్తి చేస్తావా?

14. రాత్రిపూట ఆకాశం కౌగిలిలో చంద్రుడు ఓదార్పు పొందినట్లే, నీ ప్రేమలో నాకు ఓదార్పు దొరుకుతుంది. నా దారిని నడిపించే వెలుగుగా మారుతావా?

15. "నీ హృదయ స్పందన నాకొక ప్రేమ గీతం, నీ ప్రతి శ్వాస నాకొక వాగ్దానం. నా గుండె లయ నిన్ను కోరుకుంటోంది. నా తోడుగా నడిచేందుకు నువ్వు సిద్ధమా?

Whats_app_banner