OnePlus 9 Pro Price Drop | మరింత దిగజారిన స్మార్ట్‌ఫోన్‌ ధర, ఈసారి ఎంతో తెలుసా?-oneplus 9 pro 5g smartphone get further price cut of rs 4k ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oneplus 9 Pro Price Drop | మరింత దిగజారిన స్మార్ట్‌ఫోన్‌ ధర, ఈసారి ఎంతో తెలుసా?

OnePlus 9 Pro Price Drop | మరింత దిగజారిన స్మార్ట్‌ఫోన్‌ ధర, ఈసారి ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 09:43 AM IST

వన్‌ప్లస్ కంపెనీ తమ స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గిస్తోంది. తమ బ్రాండ్ నుంచి అత్యంత శక్తివంతమైన ఫోన్ OnePlus 9 Pro ధరను కూడా భారీగా తగ్గించింది. ఆ వివరాలు

OnePlus 9 Pro
OnePlus 9 Pro

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్ తమ బ్రాండ్ నుంచి OnePlus 10T స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన తర్వాత, మిగతా కొన్ని మోడల్స్ ధరలపై డిస్కౌంట్ ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా ప్రీమియం ఫీచర్లు కలిగిన శక్తివంతమైన OnePlus 9 Pro స్మార్ట్‌ఫోన్‌ ధరను మరింత తగ్గించింది. గతంలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను దాదాపుగా రూ. 6 వేల వరకు తగ్గించింది. తాజాగా మరోసారి మరో రూ. 4200 తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

OnePlus 9 Pro స్మార్ట్‌ఫోన్‌ రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో 8GB+128GB వేరియంట్ పాత ధర రూ. రూ.54,199/- కాగా, ప్రస్తుతం ఇది రూ. 49,999/- కే లభిస్తుంది. అదేవిధంగా 12GB+256GB వేరియంట్ పాత ధర రూ.59,199/- కాగా, ప్రస్తుతం ఇది రూ. 54,199 ధరకు లభ్యమవుతోంది.

5G స్మార్ట్‌ఫోన్‌ మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్, సెయింట్ అల్లెర్ బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో మరోసారి పరిశీలించండి.

OnePlus 9 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7-అంగుళాల క్వాడ్ HD+ డిస్‌ప్లే డిస్‌ప్లే
  • 8GB/12GB RAM, 128GB/256GB స్టోరేజ్ సామర్థ్యం
  • ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
  • వెనకవైపు 48MP+ 50MP+ 8MP +2MP క్వాడ్ కెమెరా సెటప్‌
  • ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ ఆక్సిజన్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4500mAh బ్యాటరీ, 65W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌

ఈ ఫోన్ వాటర్ రెసిస్టెంట్‌ కోసం IP68 రేటింగ్ కలిగి ఉంది. ఇంకా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, రెండు Dolby Atmos స్టీరియో స్పీకర్‌లు సహా ప్రీమియం ఫోన్లో ఉండేటవంటి ఫీచర్లు అన్నీ ఉన్నాయి.

ఇది మాత్రమే కాదు వన్‌ప్లస్ ఇది మాత్రమే కాదు వన్‌ప్లస్ తమ OnePlus Nord CE 2 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ ధరను కూడా తగ్గించింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్