Monday Motivation : విడిపోయామని రివేంజ్ ప్లాన్ చేస్తే అస్సలు మీది ప్రేమే కాదు-monday motivation never plan revenge after love breakup its called psychoism not love ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : విడిపోయామని రివేంజ్ ప్లాన్ చేస్తే అస్సలు మీది ప్రేమే కాదు

Monday Motivation : విడిపోయామని రివేంజ్ ప్లాన్ చేస్తే అస్సలు మీది ప్రేమే కాదు

Anand Sai HT Telugu
Feb 12, 2024 05:00 AM IST

Monday Motivation : ఈ కాలం జనరేషన్.. ఎవరివల్లైనా బాధపడితే మెుదట వచ్చే ఆలోచన ప్రతీకారం. ప్రేమించామని వెంట తిరిగిన వ్యక్తి దగ్గర కూడా రివేంజ్ ప్లాన్ చేస్తుంటారు. అసలు రివేంజ్ ప్లాన్ చేస్తే మీది ప్రేమ ఎలా అవుతుంది?

బ్రేకప్ చెప్పేదైతే ప్రేమ కాదు
బ్రేకప్ చెప్పేదైతే ప్రేమ కాదు (Unsplash)

ప్రేమ అంటే చాలా గొప్పది. ఈ కాలంలో దానికి అర్థాలు మారిపోయాయి. నాలుగు రోజులు చూసుకుని ఆకర్శణకు లోనైతే ప్రేమ అని నిర్వచనం ఇచ్చేస్తున్నారు. సరే అది ఎన్ని రోజులు ఉంటుందనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రేమంటే కేవలం ఆకర్శణ మాత్రమే కాదు.. రెండు జీవితాల బాధ్యత. బాధ్యత లేకుండా చేసుకునే లవ్ .. లవ్వే కాదు. నాలుగు రోజులు కలిసి తిరిగితే పోతుంది.

ఈ కాలంలో చాలా మంది చేసేది ఇదే. చూసిన రెండో రోజే ప్రపోజ్ చేసుకోవడం.. నాలుగో రోజు నుంచి బయట తిరగడం. మళ్లీ ఏదైనా సమస్య వచ్చి విడిపోతే బెదిరింపులు. అసలు విడియేది ప్రేమే కాదు.. కర్మకాలి విడిపోతే.. ఇక రివేంజ్ ప్లాన్ మెుదలు. కొన్ని నిజమైన ప్రేమలు కూడా ముగింపు విషాదంగానే ఉంటుంది. ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రేమల ముగింపు అంతే. అయితే ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నా.. ఎవరితో ఉన్నా.. సంతోషంగా ఉండాలని కోరుకోవడమే అసలైన ప్రేమకు అర్థం.

మనతో ఇప్పుడు ఉండటం లేదు కదా అని రివేంజ్ ప్లాన్ చేస్తే అది సైకోయిజం అంటారు.. ప్రేమ అని దానికి పేరు పెట్టకూడదు. విడిపోయినా మనం ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. నిజమైన ప్రేమ అంటే వెంట పడి ప్రేమించడం కాదు.. మనం ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, మన వలన ఎలాంటి హాని జరగకూడదని కోరుకోవడం..

ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, కోపం తెచ్చుకోవడం, విడిపోవడం నేటి ప్రేమ కథలు. మీరు ఇలా విడిపోతే నిరాశ చెందకూడదు. వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకునేందుకు ట్రై చేయాలి. ఇద్దరూ కలిసి ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలి. అంతేగానీ ప్రేమించిన సమయంలో ఉన్న గుర్తులను చూపి.. బెదిరించకూడదు. దాదాపు ఎక్కువ ప్రేమ కథలు కుటుంబం కోసమే విడిపోతాయి. కొందరు మాత్రమే వేరే వారి ప్రేమలో పడిపోవడం వలన జరుగుతాయి. అయితే వేరే వారికి వారు దగ్గర అవుతున్నారంటే అది నిజమైన ప్రేమ కాదు. మీ మీద ఆకర్శణ మాత్రమే. మీరు నిజాయితీగా ప్రేమించి ఉంటే వారి మంచిని కోరుకొండి.

ప్రేమలో విఫలమైతే కొత్తగా ఏదైనా నేర్చుకునేందుకు ప్రయత్నించండి. అప్పుడే మీరు ఆ బాధ నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే అవే ఆలోచనల్లో గడిపేస్తారు. ప్రేమించిన వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తారు. మీరు రివేంజ్ ప్లాన్ చేస్తే.. అవతలి వారి జీవితంతోపాటుగా మీ జీవితం కూడా నాశనం అవుతుంది. ఎప్పుడూ అదే ఆలోచనల్లో ఉంటే జీవితంలో పైకి ఎదగలేరు.

మీరు కూడా ప్రేమలో విఫలమైన వ్యక్తినే పెళ్లి చేసుకోండి.. ఎందుకంటే వారికి నిజమైన ప్రేమ ఏంటో తెలుసు..

ప్రేమ అంటే అంతే కనెక్ట్ అయిపోతారు.. ఎందుకంటే పాస్ వర్డ్ లేని వైఫై లాంటిది. అడిక్ట్ అయిపోతారు.. ఎందుకంటే ఆల్కహాల్ లేని స్వీట్ లాంటిది.. కానీ మన వలన మనం ప్రేమించిన వారికి బాధ కలుగుతుందంటే తప్పుకోవడమే కరెక్ట్.

Whats_app_banner