Sunday Breakfast Recipes। గుడ్డుతో అల్పాహారం చేయండి, మీ ఆదివారాన్ని అదరగొట్టండి!
Sunday Breakfast Recipes: ఇక్కడ మీ కోసం గుడ్లతో చేసుకోగలిగే కొన్ని సులభమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలను అందిస్తున్నాము, ఇందులో మీకు నచ్చిన రెసిపీని ట్రై చేయండి.
Sunday Breakfast Recipes (istock)
Sunday Breakfast Recipes: తక్కువ సమయంలో రుచికరమైన అల్పాహారం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్డుతో చేసుకునే అల్పాహారాలు ఉత్తమంగా ఉంటాయి. అసలే ఆదివారం, ఆపైన ఇది వర్షాకాలం, ఇలాంటి సమయంలో ఉదయం అల్పాహారం కోసం ఏం చేసుకోవాలన్నా బద్ధకం ఉంటుంది. కానీ ఫటాఫట్ గా గుడ్డుతో ఎన్నో రకాల వెరైటీలు చేసుకోవచ్చు. రుచికరమైన ఆహారంతో మీ కడుపు నింపుకోవచ్చు. అదనంగా గుడ్లు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి, ఇవి మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
ఇక్కడ మీ కోసం గుడ్లతో చేసుకోగలిగే కొన్ని సులభమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలను అందిస్తున్నాము, ఇందులో మీకు నచ్చిన రెసిపీని ట్రై చేయండి.
పాలకూర- ఫెటా ఎగ్ రెసిపీ
- ఒక పాన్‌లో కొద్దిగా ఆలివ్ నూనె వేసి పాలకూరను దోరగా వేయించండి.
- ఆపై గుడ్లు గిలకొట్టి వేయండి.
- అనంతరం ముక్కలుగా చేసిన ఫెటా చీజ్‌ని వేసి వేయించండి.
- పోషకమైన, సువాసనతో కూడిన అల్పాహారం సిద్ధం.
అవకాడో ఎగ్ టోస్ట్ రెసిపీ
- ముందుగా 2 గుడ్లు ఉడకబెట్టి, వాటిని ముక్కలుగా కోసి పెట్టుకోండి.
- ఒక స్కిల్లెట్ ఉపయోగించి బ్రెడ్ ముక్కలను టోస్ట్ చేయండి
- ఇప్పుడు ఒక అవోకాడో తొక్క తీసి, మెత్తగా నొక్కుతూ ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపి పేస్ట్ లాగా చేసుకోవాలి.
- అనంతరం బ్రెడ్ టోస్ట్‌పై అవకాడో పేస్ట్‌ను పూయండి.
- దాని మీద కట్ చేసిన టొమాటో ముక్కలను, ఆపై గుడ్డు ముక్కలు ఉంచండి, చివరగా చిల్లీ ఫ్లేక్స్‌ను చల్లుకోండి. అవకాడో ఎగ్ టోస్ట్ రెడీ.
చీజ్ ఎగ్ రోల్ రెసిపీ
- 2 గుడ్లను పగలగొట్టి తెల్లసొన, పచ్చ సొనను వేరు చేయండి.
- ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి.
- ముందుగా గుడ్డులోని తెల్లసొన భాగాన్ని ఆమ్లెట్ లాగా చేసి ఉప్పు, మిరియాల పొడి చల్లుకోవాలి
- తర్వాత పచ్చసొనపై చీజ్ క్యూబ్స్ వేసి, వేడి చేయండి, తెల్లటి ఆమ్లెట్ తయారు చేసి మడవండి. చీజ్ ఎగ్ రోల్ రెడీ.
ఎగ్ ఇన్ ఎ హోల్ రెసిపీ
- బ్రెడ్ స్లైస్ మధ్యలో ఒక రంధ్రం కట్ చేసి, దానిని నూనె వేడి చేసిన పాన్‌లో ఉంచండి.
- బ్రెడ్ స్లైస్ రంధ్రంలోకి గుడ్డు పగులగొట్టి, ఉడికించాలి.
- రుచి కోసం ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోండి. ఎగ్ ఇన్ ఎ హోల్ రెడీ.
ఇవే కాకుండా మీరు ఎప్పుడూ చేసుకొనే బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ శాండ్‌విచ్ వంటివి మరెన్నో మీకు తెలిసిన రెసిపీలు ఉండనే ఉన్నాయి.
సంబంధిత కథనం